India vs South Africa 3rd ODI Today: ఇవాళ సౌతాఫ్రికాతో మూడో వన్డే..భారత్ హ్యాట్రిక్ కొడుతుందా.?
భారత్ హ్యాట్రిక్ కొడుతుందా.?

India vs South Africa 3rd ODI Today: వన్డే వరల్డ్ కప్ లో వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచి జోరుమీదున్న టీమిండియా మహిళల జట్టు సౌతాఫ్రికాతో మూడో వన్డేకు సిద్దమైంది. ఇప్పటికే శ్రీలంక, పాకిస్తాన్‌లపై విజయాలు సాధించి మంచి ఊపు మీద ఉంది. ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్ విజయం కోసం ఆ జట్టు బరిలోకి దిగనుంది. ఇవాళ వైజాగ్ లోని వైఎస్సార్ స్టేడియంలో మధ్యాహ్నం 3:00 గంటలకు ఈ మ్యాచ్ మొదలవుతుంది. పాకిస్తాన్ తో పోల్చితే సౌతాఫ్రికా జట్టు బలంగా ఉంది. టాపార్డర్ విఫలమైతే టీమిండియా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ బ్యాటింగ్ లో రాణిస్తే మూడో విక్టరీ ఖాయం.
సౌతాఫ్రికా జట్టు
లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్ ), తజ్మిన్ బ్రిట్స్, సునే లూస్, మారిజానే కాప్, అన్నెకే బాష్, సినాలో జాఫ్తా (వికెట్ కీపర్), క్లో ట్రయాన్, నాడిన్ డి క్లెర్క్, అన్నరీ డెర్క్‌సెన్/మసాబాటా క్లాస్, అయాబొంగా ఖాకా, నాంకులులేకో మ్లాబా
టీమిండియా జట్టు
స్మృతి మంధాన, ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్ ), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (WK), అమంజోత్ కౌర్, దీప్తి శర్మ, స్నేహ రాణా, శ్రీ చరణి, రేణుకా ఠాకూర్/క్రాంతి గౌడ్
