నేటి నుండే టీ20 పోరు!

India vs South Africa T20: భారత క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 అంతర్జాతీయ సిరీస్ ఈ రోజు (డిసెంబర్ 9) నుండి ప్రారంభం కానుంది. ఇప్పటికే జరిగిన టెస్ట్ సిరీస్‌ను దక్షిణాఫ్రికా గెలుచుకోగా, వన్డే సిరీస్‌ను టీమిండియా సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో, ఇప్పుడు మొదలవుతున్న పొట్టి ఫార్మాట్ పోరులో ఏ జట్టు పైచేయి సాధిస్తుందోనని ఉత్కంఠ నెలకొంది.

ఈ సిరీస్‌లో భాగంగా మొదటి టీ20 మ్యాచ్ ఒడిశాలోని కటక్ పట్టణంలో ఉన్న బారాబతి స్టేడియంలో రాత్రి 7 గంటలకు మొదలవుతుంది. టీమిండియాకు యువ సంచలనం, స్టార్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్) నాయకత్వం వహిస్తుండగా, దక్షిణాఫ్రికా జట్టుకు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ ఐడెన్ మార్క్రామ్ సారథ్యం వహించనున్నాడు.

గాయాల కారణంగా కొంతకాలం జట్టుకు దూరమైన స్టార్ ఆటగాళ్లు తిరిగి జట్టులో చేరడం టీమిండియాకు అతిపెద్ద సానుకూల అంశం. గాయం నుంచి కోలుకున్న ఓపెనర్ శుభ్‌మన్ గిల్, విధ్వంసక ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ టీ20 సిరీస్‌కు అందుబాటులో ఉండనున్నారు. వీరిద్దరి రాకతో భారత జట్టు మరింత పటిష్టంగా మారనుంది. బౌలింగ్, బ్యాటింగ్‌లలో బలమైన దక్షిణాఫ్రికాను టీమిండియా ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story