India vs West Indies Test: భారత్ vs వెస్టిండీస్ టెస్ట్: విజయం దిశగా భారత్
విజయం దిశగా భారత్

India vs West Indies Test: భారత్‌తో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు ఫేలవమైన ఆటతీరును ప్రదర్శిస్తోంది. మొదటి రెండు రోజుల్లోనే భారత్ పూర్తి ఆధిపత్యం సాధించి విజయం వైపు దూసుకుపోతోంది. మూడోరోజే ఆటముగిసేలా కనిపిస్తోంది. భారత్ విజయం ఖాయంగా కనిపిస్తోంది.
ఎందుకంటే..రెండో ఇన్నింగ్స్‌లో కూడా వెస్టిండీస్ బ్యాటింగ్ వైఫల్యం కొనసాగుతోంది. మూడో రోజు ఆట ప్రారంభం కాగానే భారత్ తమ ఇన్నింగ్స్‌ను 448 దగ్గర డిక్లేర్ చేసి వెస్టిండీస్ ముందు 286 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో కూడా వరుసగా వికెట్లు కోల్పోయింది. జడేజా మూడు వికెట్లతో చెలరేగాడు. దీంతో మూడో రోజు లంచ్ సమయానికి 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది వెస్టిండీస్. ప్రస్తుతం 240 పరుగుల వెనకంజలో ఉంది
ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలహీనతలను ప్రదర్శించింది. భారత్ తో పోటీ పడలేకపోయిన వెస్టిండీస్ జట్టు, ఈ టెస్ట్ సిరీస్ లో గట్టి సవాలును ఎదుర్కొంటున్నట్లు ఈ మ్యాచ్ నిరూపించింది.
