మహిళల క్రికెట్ సిరీస్ వాయిదా!

India–Bangladesh Women’s Cricket Series Postponed: డిసెంబర్‌లో జరగాల్సిన భారత్, బంగ్లాదేశ్ మహిళల క్రికెట్ జట్ల మధ్య సిరీస్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వాయిదా వేసింది. రెండు దేశాల మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. బీసీసీఐ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, ఈ సిరీస్ కోసం తమకు ప్రభుత్వం నుండి అనుమతి లభించలేదని వెల్లడించాయి. భారత మహిళల జట్టు డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌లో పర్యటించి మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. అయితే, ఈ పర్యటనకు సంబంధించి కీలకమైన ప్రభుత్వ అనుమతి నిరాకరించబడటంతో, బీసీసీఐ ఈ సిరీస్‌ను వాయిదా వేయక తప్పలేదు. బీసీసీఐ వర్గాల అంతర్గత సమాచారం ప్రకారం, ఇటీవల రెండు దేశాల మధ్య పెరిగిన దౌత్యపరమైన ఉద్రిక్తతలే ఈ అనుమతి నిరాకరణకు ముఖ్య కారణంగా కనిపిస్తున్నాయి. క్రీడా సంబంధాలు దౌత్య సంబంధాలపై ప్రభావం చూపకుండా ఉండేందుకు లేదా భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సిరీస్ వాయిదాతో భారత మహిళల జట్టు అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్‌లో ఏర్పడిన ఖాళీని పూరించడానికి బీసీసీఐ సిద్ధమవుతోంది. బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు మాకు పర్మిషన్ రాలేదు.డిసెంబర్‌లో ప్రత్యామ్నాయ సిరీస్‌కు లేదా త్రిపక్ష సిరీస్‌కు ఏర్పాట్లు చేస్తాము. భారత జట్టు త్వరలోనే మరో అంతర్జాతీయ సిరీస్ ఆడే అవకాశం ఉంది. షెడ్యూల్‌లో ఉన్న ఆరు మ్యాచ్‌ల (3 వన్డేలు, 3 టీ20లు) సిరీస్ ఎప్పుడు జరుగుతుందనే దానిపై ప్రస్తుతం స్పష్టత లేదు. పరిస్థితులు మెరుగుపడిన తర్వాత ఈ సిరీస్‌ను తిరిగి రీ-షెడ్యూల్ చేసే అవకాశం ఉంది. ఈ పరిణామం మహిళల క్రికెట్ అభిమానులలో కొంత నిరాశను కలిగించింది అని బీసీసీఐ తెలిపింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story