Veda Krishnamurthy Announces Retirement from Cricket: క్రికెట్ కు గుడ్ బై చెప్పిన టీమిండియా క్రికెటర్
గుడ్ బై చెప్పిన టీమిండియా క్రికెటర్

Veda Krishnamurthy Announces Retirement from Cricket: భారత మహిళల జట్టు క్రికెటర్ వేదా కృష్ణమూర్తి అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పింది. అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించింది.2011 జూన్ 30న డెర్బీలో ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే అంతర్జాతీయ (ODI) మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసింది. ఈ తొలి మ్యాచ్‌లోనే 51 పరుగులు చేసి అందరినీ ఆకట్టుకుంది.
ఆమె రైట్ హ్యాండ్ బ్యాటర్ , రైట్ ఆర్మ్ లెగ్‌బ్రేక్ బౌలింగ్ చేస్తుంది. 2017 ICC మహిళల క్రికెట్ ప్రపంచ కప్ , 2020 ICC మహిళల T20 ప్రపంచ కప్‌లో భారత జట్టులో కీలక సభ్యురాలు. ఈ రెండు టోర్నమెంట్‌లలోనూ భారత్ ఫైనల్‌కు చేరుకుంది. 2017 ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్‌పై ఆమె చేసిన 70 పరుగులు (45 బంతుల్లో) భారత్ సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి.
కర్ణాటక తరపున కెప్టెన్‌గా వ్యవహరించింది. వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) లో గుజరాత్ జెయింట్స్, వుమెన్స్ బిగ్ బ్యాష్ లీగ్ (WBBL) లో హోబర్ట్ హరికేన్స్ వంటి ఫ్రాంచైజీల తరపున కూడా ఆడింది.2023లో కర్ణాటక క్రికెటర్ అర్జున్ హోయసలను వివాహం చేసుకుంది.
