వైభవ్

Indian T20 Team: క్రికెట్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్. జింబాబ్వే పర్యటనకు వెళ్లే భారత టీ20 జట్టును బీసీసీఐ (BCCI) అధికారికంగా ప్రకటించింది. ఈ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహించనుండగా, తెలుగు తేజం తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
ఈ జట్టులో పలువురు యువ సంచలనాలకు చోటు దక్కడం విశేషం. బీహార్‌కు చెందిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ భారత సీనియర్ టీ20 జట్టులో చోటు దక్కించుకుని సరికొత్త చరిత్ర సృష్టించాడు. సంజూ శాంసన్‌ను పక్కనబెట్టి సెలెక్టర్లు ఈ యువకుడికి పెద్ద పీట వేశారు. ఐపీఎల్, డొమెస్టిక్ క్రికెట్‌లో సత్తా చాటిన ప్రభ్‌సిమ్రన్ సింగ్, అశోక్ శర్మ , యష్ ఠాకూర్‌లు తొలిసారిగా జాతీయ జట్టు నుంచి పిలుపు అందుకున్నారు.
అలాగే స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, స్పీడ్‌స్టర్ మయాంక్ యాదవ్‌లు కూడా ఈ స్క్వాడ్‌లో ఉన్నారు.వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్, హిట్టర్ రింకూ సింగ్‌లు తిరిగి జట్టులోకి రాగా.. శివమ్ దూబే, అభిషేక్ శర్మ వంటి యువ ఆల్‌రౌండర్లు మిడిలార్డర్‌కు బలాన్ని ఇవ్వనున్నారు.
భారత టీ20 స్క్వాడ్:
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (కీపర్), శివమ్ దూబే, సూర్యాంశ్ శెడ్గే, రింకూ సింగ్, హర్ష్ దూబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, యష్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (కీపర్).
జూలై 23 నుంచి హరారే వేదికగా ఈ సిరీస్ ప్రారంభం కానుంది. మరి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఈ కొత్త టీమిండియా యువ సైన్యం జింబాబ్వే గడ్డపై ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.

