బోణీ కొట్టిన ఇండియా

Indian Under-19 team Tour: భారత అండర్-19 జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతమైన విజయం సాధించింది. బ్రిస్బేన్‌లోని ఇయాన్ హీలీ ఓవల్‌లో జరిగిన మొదటి యూత్ వన్డేలో ఆస్ట్రేలియా అండర్-19 జట్టుపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా, భారత బౌలర్ల క్రమశిక్షణతో కూడిన బౌలింగ్‌కు 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 225 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో హెనిల్ పటేల్ 3 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. 226 పరుగుల లక్ష్య ఛేదనలో భారత యువ జట్టు కేవలం 30.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సులభంగా ఛేదించింది.

అభిజ్ఞాన్ కుండు 74 బంతుల్లో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.వేదాంత్ త్రివేది 69 బంతుల్లో 61 పరుగులు చేసి కీలక సహకారం అందించాడు.ఈ మ్యాచ్‌లో అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టుకు విజయాన్ని అందించిన అభిజ్ఞాన్ కుండుకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ యువ జట్టు భవిష్యత్తులో భారత సీనియర్ జట్టుకు మంచి ఆటగాళ్లను అందిస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story