క్రికెటర్ మిథాలీ రాజ్‌కు అరుదైన గౌరవం

Cricketer Mithali Raj: భారత మహిళా క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌కు విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో అరుదైన గౌరవం లభించింది. ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా, స్టేడియంలోని ఒక స్టాండ్‌కు మిథాలీ పేరును నామకరణం చేశారు. అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్ నుంచి అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదిగిన వికెట్ కీపర్-బ్యాటర్ రావి కల్పన పేరును స్టేడియం గేట్‌కు పెట్టి ఆమె సేవలను కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) సత్కరించింది. ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025లో భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ (అక్టోబర్ 12న). ఐసీసీ ఛైర్మన్ జై షా మరియు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ మిథాలీ రాజ్ స్టాండ్ ను, 'రావి కల్పన గేట్ ను అధికారికంగా ప్రారంభించారు.దేశంలో మహిళా క్రికెటర్ల పేరు మీద స్టేడియంలో స్టాండ్‌లు నామకరణం చేయడం ఇదే తొలిసారి. మహిళా క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వడంలో ఇదొక చారిత్రక ఘట్టమని ఏసీఏ పేర్కొంది. ఈ గౌరవం పట్ల మిథాలీ రాజ్ భావోద్వేగానికి లోనయ్యారు."విశాఖలో నా పేరు మీద స్టాండ్ ఏర్పాటు చేయడం నిజంగా దక్కిన అరుదైన గౌరవం. క్రికెటర్ గా నేను ఎదిగే క్రమంలో విశాఖకు ప్రత్యేక స్థానం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఏసీఏ పెద్దలు నాకు ఈ గుర్తింపునివ్వడం పట్ల కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా పయనం స్ఫూర్తిగా తీసుకొని ఎంతో మంది యువతులు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలని ఆకాంక్షిస్తున్నాను" అని మిథాలీ రాజ్ అన్నారు.మిథాలీ రాజ్‌కు నివాళిగా, మంత్రి నారా లోకేష్ ఏసీఏ లోగోతో కూడిన హ్యాండ్‌క్రాఫ్ట్ చేసిన వెండి క్రికెట్ బంతిని బహుమతిగా అందించారు. భారత క్రికెట్‌లో మిథాలీ వారసత్వాన్ని, ఆమె స్ఫూర్తిని ఈ సత్కారం చాటుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story