సెమీస్ కు భారత్

India storms into semifinals: డూ ఆర్ డై మ్యాచ్ లో న్యూజిలాండ్‌పై భారత మహిళల జట్టు 53 పరుగుల తేడాతో(డక్ వర్త్ లూయిస్-స్టెర్న్ పద్ధతి - DLS)ప్రకారం విజయం సాధించింది. ఈ విజయం ముఖ్యంగా ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 టోర్నమెంట్‌లో సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించింది.

వర్షం కారణంగా మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్, ఓపెనర్లు స్మృతి మంధాన (109) ప్రతీకా రావల్ (122) శతకాలతో పాటు, జెమీమా రోడ్రిగ్స్ (76 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ తో నిర్ణీత 49 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. మళ్లీ వర్షం రావడంతో DLS పద్ధతి ప్రకారం న్యూజిలాండ్‌కు 44 ఓవర్లలో 325 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.

లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ 8 వికెట్ల నష్టానికి 271 పరుగులు మాత్రమే చేయగలిగింది. వారి జట్టులో బ్రూక్ హాలిడే (81, ఇసాబెల్లా గేజ్ (65 నాటౌట్) పోరాడినా ఫలితం లేకపోయింది.ఈ విజయం ద్వారా భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ జట్ల తర్వాత ప్రపంచ కప్ సెమీ-ఫైనల్స్‌కు చేరిన నాల్గవ జట్టుగా నిలిచింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story