టీమిండియా స్టార్ క్రికెటర్

Indian women's cricket team opener Smriti Mandhana: భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్ స్మృతి మంధాన పెళ్లి పీటలెక్కబోతుంది. నిశ్చితార్థం (Engagement) జరిగిన విషయాన్ని స్మృతి మంధాన తన సహచర క్రికెటర్లతో కలిసి చేసిన ఒక సరదా వీడియో (రీల్) ద్వారా తెలిపింది. స్మృతి ప్రముఖ సంగీత దర్శకుడు పలాష్ ముచ్ఛల్ (Palash Muchhal)‌ను వివాహం చేసుకోబోతున్నారు.

అధికారిక ప్రకటన లేనప్పటికీ పలాష్ ముచ్ఛల్ (Palash Muchhal) - బాలీవుడ్ సంగీత దర్శకుడు, దర్శకుడు. ఆయన సోదరి పాలక్ ముచ్ఛల్ కూడా ప్రముఖ గాయని.

వారి వివాహం ఈ నెల నవంబర్ 23న జరగనున్నట్లు తెలుస్తోంది. వివాహ వేడుకలు స్మృతి మంధాన సొంతూరు అయిన మహారాష్ట్రలోని సాంగ్లీలో జరగనున్నట్లు సమాచారం.ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని అభిమానులు, క్రీడా , సినీ ప్రముఖులు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

భారత మహిళల క్రికెట్ జట్టులో అత్యంత ప్రతిభావంతురాలైన, ప్రజాదరణ పొందిన క్రీడాకారిణి స్మృతి మంధాన.భారత మహిళల జట్టు వైస్-కెప్టెన్, WPLలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్. టెస్ట్, వన్డే (ODI), టీ20 (T20I) - ఈ మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన ఏకైక భారతీయ మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. ఆమె నాయకత్వంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు 2024లో తొలి మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) టైటిల్‌ను గెలుచుకుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story