ప్రధాన కారణాలివే..

India's Defeat: భారత్ -ఇంగ్లాండ్ మధ్య లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. ఇంగ్లాండ్ జట్టు 22 పరుగుల తేడాతో విజయం సాధించి, ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది.

193 పరుగుల టార్గెట్ బరిలోకి దిగిన ఇండియా చేతులెత్తేసింది. టాప్ ఆర్డర్ విఫలమైంది. కేఎల్ రాహుల్, జడేజా మాత్రమే రాణించారు. చివరి వరకు జడేజా ఒంటిరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. స్టోక్స్‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌‌‌ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు ఈ నెల 23 నుంచి మాంచెస్టర్‌‌‌‌‌‌‌‌లో జరుగుతుంది.

ఈ ఓటమితో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025-27 టేబుల్ లో భారత్ రెండవ స్థానం నుంచి నాల్గో స్థానానికి పడిపోయింది. ఇంగ్లాండ్ ఈ విజయంతో రెండవ స్థానానికి చేరుకుంది.

భారత్ ఓటమికి ప్రధాన కారణాలు:

193 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో భారత టాప్ ,మిడిలార్డర్ బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. కీలక సమయంలో వికెట్లు కోల్పోయారు.

ఇంగ్లాండ్ బౌలర్లు బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్ వంటి బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు తీసి భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. ముఖ్యంగా బెన్ స్టోక్స్ తన బౌలింగ్‌తో భారత బ్యాటర్లను కట్టడి చేశాడు.

ఈ సిరీస్‌లో భారత్ కీలక క్యాచ్‌లను జారవిడిచారు. ఈ మ్యాచ్‌లో కూడా కొన్ని కీలక క్యాచ్‌లు మిస్ అయ్యాయి. ఇది ఇంగ్లాండ్ కు ప్లస్ అయ్యింది.

భారత బ్యాటర్లు లంచ్ బ్రేక్‌కు ముందు తరచుగా వికెట్లు కోల్పోవడం ఇంగ్లాండ్‌కు కలిసొచ్చింది.

తొలి ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ రనౌట్ కావడం మ్యాచ్ టర్నింగ్ పాయింట్.

జడేజా ఒంటిరి పోరాటం చేసినా..అతడికి మరో ఎండ్ లో అండగా నిలబడే బ్యాట్స్ మెన్ లేకపోవడం.

PolitEnt Media

PolitEnt Media

Next Story