సౌతాఫ్రికాపై ఇండియా గ్రాండ్ విక్టరీ..టీ20 సిరీస్ మనదే
టీ20 సిరీస్ మనదే

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐదో టీ20లో టీమిండియా 30 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి, సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. 2025 సంవత్సరాన్ని భారత్ విజయంతో ముగించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 231/5 భారీ స్కోరు చేసింది.తిలక్ వర్మ 42 బంతుల్లో 73 పరుగులు (10 ఫోర్లు, 1 సిక్స్) చేసి అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాడు.హార్దిక్ పాండ్యా కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి (మొత్తంగా 25 బంతుల్లో 63 పరుగులు), భారత్ తరపున రెండో వేగవంతమైన టీ20 ఫిఫ్టీ నమోదు చేశాడు.ఓపెనింగ్ జోడీ సంజూ శామ్సన్ (37), అభిషేక్ శర్మ (34) పవర్‌ప్లేలో మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు.232 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 201/8 పరుగులకే పరిమితమైంది.వరుణ్ చక్రవర్తి 4 వికెట్లు తీసి సౌతాఫ్రికా మిడిల్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు.
జస్ప్రీత్ బుమ్రా తన 4 ఓవర్లలో కేవలం 17 పరుగులే ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా ప్రమాదకరంగా మారిన క్వింటన్ డికాక్ (65) వికెట్ తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. వరుసగా ఇది భారత్‌కు 8వ ద్వైపాక్షిక టీ20 సిరీస్ విజయం.

