ఇంగ్లాండ్ కే సిరీస్

India Must Win: ఇంగ్లాండ్ తో ఇవాళ ఇండియా ఐదో టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. లండన్ లోని ది ఓవల్ లో మధ్యాహ్నం మ్యాచ్ స్టార్ట్ కానుంది. ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో ఉంది. సిరీస్‌ను సమం చేయడానికి భారత్ ఈ ఐదో టెస్ట్‌ని తప్పనిసరిగా గెలవాలి. భారత్ ఓడినా..డ్రా చేసుకున్నా ఇంగ్లాండ్ సిరీస్ కైవసం చేసుకుంటుంది.ఈ సిరీస్ 2025-27 ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరుగుతోంది.

ఇండియా (అంచనా): శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌, యశస్వి జైస్వాల్‌‌‌‌, సాయి సుదర్శన్‌‌‌‌, వాషింగ్టన్‌‌‌‌ సుందర్‌‌‌‌, రవీంద్ర జడేజా, ధ్రువ్‌‌‌‌ జురెల్‌‌‌‌, శార్దూల్‌‌‌‌ ఠాకూర్‌‌‌‌ / కుల్దీప్‌‌‌‌ యాదవ్‌‌‌‌/ అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ సింగ్‌‌‌‌, ఆకాశ్‌‌‌‌ దీప్‌‌‌‌, ప్రసిధ్‌‌‌‌ కృష్ణ, సిరాజ్‌‌‌‌. ఇంగ్లండ్‌‌‌‌: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒలీ పోప్ (కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్, జేమీ స్మిత్, క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, జేమీ ఓవర్టన్, జోష్ టంగ్.

పిచ్‌‌‌‌, వాతావరణం

ఓవల్‌ గ్రౌండ్‌లో జరిగిన 21 ఫస్ట్‌‌‌‌ క్లాస్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ల్లో టాస్‌‌‌‌ నెగ్గిన జట్టు బౌలింగ్‌‌‌‌ ఎంచుకున్నాయి. పిచ్‌‌‌‌పై పచ్చిక కనిపిస్తున్న నేపథ్యంలో బౌలింగ్‌కు మొగ్గుక కనిపిస్తోంది. గురువారం మధ్యాహ్నం చిరుజల్లులు పడే చాన్స్‌‌‌‌ ఉంది. చివరి రెండు రోజుల్లోనూ వర్ష సూచన ఉంది.India's Loss or Draw — Series Belongs to England

PolitEnt Media

PolitEnt Media

Next Story