ఆసియా కప్ లో ఇండియా బోణీ

India's Record Victory: ఆసియా కప్ 2025 టోర్నమెంట్‌లో భాగంగా సెప్టెంబర్ 10న జరిగిన లీగ్ మ్యాచ్‌లో టీమిండియా యూఏఈపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయం భారత్ జట్టుకు టోర్నమెంట్‌లో అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చింది.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత జట్టు బౌలర్ల ముందు యూఏఈ జట్టు పూర్తిగా చేతులెత్తేసింది. కేవలం 13.1 ఓవర్లలో 57 పరుగులకే ఆలౌట్ అయింది. ఇది టీ20 ఫార్మాట్‌లో భారత్‌పై యూఏఈ చేసిన అత్యల్ప స్కోరు.

స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (4/7) యూఏఈ బ్యాటింగ్‌ లైనప్ ను కూల్చడంలో కీలక పాత్ర పోషించాడు. అతనికి పేసర్ శివమ్ దూబే (3/4) కూడా సహకారం అందించి కీలక వికెట్లు తీశాడు. అనంతరం 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా కేవలం 4.3 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (30), శుభ్మన్ గిల్ (20 నాటౌట్) వేగంగా పరుగులు చేసి విజయాన్ని సులభతరం చేశారు.

తన అద్భుతమైన స్పిన్ మాయాజాలంతో నాలుగు వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.ఈ విజయం భారత్‌కు కేవలం గెలుపు మాత్రమే కాకుండా, నెట్ రన్ రేట్‌ను గణనీయంగా పెంచుకుంది .భారత్ తర్వాతి మ్యాచ్ ఆదివారం పాకిస్తాన్ తో తలపడనుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story