IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ఐపీఎల్ 2026 సీజన్ 19లో సరికొత్త చరిత్ర సృష్టించబడింది! ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ లీగ్‌లో కేవలం 15 ఏళ్ల వయసున్న ఒక కుర్రాడు.. దిగ్గజాల రికార్డులను బద్దలు కొడుతూ రారాజుగా నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్ యంగ్ డైనమిక్ ఓపెనర్, వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ తన సంచలన బ్యాటింగ్‌తో ఈ సీజన్ 'ఆరెంజ్ క్యాప్'ను కైవసం చేసుకున్నాడు.

వైభవ్ ఈ సీజన్‌లో ఆడిన 16 మ్యాచ్‌ల్లో.. నమ్మశక్యం కాని విధంగా 237.30 స్ట్రైక్ రేట్‌తో.. ఏకంగా 776 పరుగులు సాధించాడు. ఇందులో ఒకే సీజన్‌లో 72 సిక్సర్లు బాది, గత 13 ఏళ్లుగా యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉన్న రికార్డును తుడిచిపెట్టేశాడు. అంతేకాదు, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో ఆరెంజ్ క్యాప్ అందుకున్న ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ సరికొత్త రికార్డును లిఖించాడు.

మరోవైపు ఆరెంజ్ క్యాప్ రేసులో గుజరాత్ టైటాన్స్ వీరులు గట్టి పోటీని ఇచ్చారు. ఈ సీజన్‌లో అద్భుతమైన సెంచరీతో మెరిసిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 732 పరుగులతో రెండవ స్థానంలో నిలిచాడు. అలాగే, గత సీజన్ ఆరెంజ్ క్యాప్ విన్నర్, గుజరాత్ యువ సంచలనం సాయి సుదర్శన్ ఈసారి కూడా స్థిరమైన ప్రదర్శనతో 722 పరుగులు చేసి మూడవ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన పోరులో గిల్, సాయి సుదర్శన్ ఇద్దరూ త్వరగానే అవుట్ కావడంతో.. వైభవ్ సూర్యవంశీ అగ్రస్థానం చెక్కుచెదరకుండా నిలిచింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కేవలం 36 బంతుల్లోనే శతక్కొట్టిన ఈ బిహార్ యువ కెరటం వైభవ్.. పవర్‌ప్లేలోనే 521 పరుగులు చేసి డేవిడ్ వార్నర్ పేరిట ఉన్న పాత రికార్డును కూడా బద్దలు కొట్టాడు.

PolitEnt Media

PolitEnt Media

Next Story