IPL 2026: ఐపీఎల్‌లో అభిషేక్ శర్మ ప్రభంజనం: టీమిండియా స్టార్ సరికొత్త చరిత్ర!
టీమిండియా స్టార్ సరికొత్త చరిత్ర!

IPL 2026: ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ సంచలనం అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన 31వ మ్యాచ్‌లో ఈ 25 ఏళ్ల ఓపెనర్ తన వీరవిహారంతో పాత రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేశాడు. కేవలం 47 బంతుల్లోనే సెంచరీ బాదిన అభిషేక్, ఈ క్రమంలో పలు అరుదైన మైలురాళ్లను అందుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌తో అభిషేక్ శర్మ ఐపీఎల్ చరిత్రలో ఒక అరుదైన ఘనత సాధించిన మొదటి భారతీయ బ్యాటర్‌గా నిలిచాడు. ఐపీఎల్‌లో 50 లోపు బంతుల్లో ఒకటి కంటే ఎక్కువ సెంచరీలు సాధించిన తొలి భారతీయ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో రెండుసార్లు 10 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు బాదిన మొదటి భారతీయ బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. గత ఏడాది పంజాబ్ కింగ్స్‌పై 10 సిక్సర్లు కొట్టిన అభిషేక్, ఇప్పుడు ఢిల్లీపై అదే ఫీట్ పునరావృతం చేశాడు.
ఐపీఎల్‌లో ఒకటి కంటే ఎక్కువసార్లు ఒకే ఇన్నింగ్స్‌లో 10 సిక్సర్లు కొట్టిన రెండో బ్యాటర్‌గా అభిషేక్ నిలిచాడు. ఇప్పటివరకు క్రిస్ గేల్ (4 సార్లు) మాత్రమే ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, ఇప్పుడు అభిషేక్ (2 సార్లు) ఆయన సరసన చేరాడు. ఓవరాల్ టీ20 క్రికెట్‌లోనూ అత్యధిక సార్లు 10కి పైగా సిక్సర్లు బాదిన జాబితాలో అభిషేక్ (5 సార్లు) ఇప్పుడు ఎవిన్ లూయిస్, శ్రేయాస్ అయ్యర్‌లను అధిగమించి రెండో స్థానానికి చేరుకున్నాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ (37) అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు 97 పరుగులు జోడించిన తర్వాత, అభిషేక్ మరింత రెచ్చిపోయి ఆడాడు. లంగ్ నిగిడి, నితీష్ రాణా బౌలింగ్‌ను చీల్చిచెండాడుతూ 68 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్సర్లతో 135 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. చివర్లో హెన్రిచ్ క్లాసెన్ (13 బంతుల్లో 37 నాటౌట్) మెరుపులు తోడవడంతో సన్‌రైజర్స్ భారీ స్కోరు సాధించింది. ఢిల్లీ స్పిన్నర్లు ఈ మ్యాచ్‌లో ఏకంగా 108 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం

