IPL 2026: ఐపీఎల్ అంటేనే రికార్డుల వేదిక. కొందరు బ్యాటర్లు పరుగుల సునామీతో రికార్డులు సృష్టిస్తే, మరికొందరు ఊహించని రీతిలో 'చెత్త' రికార్డులను మూటగట్టుకుంటారు. నిన్న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే సరిగ్గా ఇలాంటి ఒక అరుదైన, చేదు జ్ఞాపకాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.

ఈ మ్యాచ్‌లో రహానే ఖాతా తెరవకుండానే, అంటే సున్నా పరుగులకే ఔటై పెవిలియన్ చేరారు. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఓపెనర్‌గా అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాడిగా రహానే నిలిచారు. ఇప్పటివరకు ఆయన ఓపెనర్‌గా 12 సార్లు డకౌట్ అయ్యి ఈ జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నారు. గతంలో ఈ రికార్డు పార్థివ్ పటేల్ పేరిట ఉండేది.ఒకసారి ఐపీఎల్‌లో ఓపెనర్‌గా ఎక్కువ సార్లు డకౌట్ అయిన ఆటగాళ్ల జాబితాను గమనిస్తే:

అజింక్య రహానే: 12 సార్లు

పార్థివ్ పటేల్: 11 సార్లు

శిఖర్ ధవన్: 10 సార్లు

గౌతమ్ గంభీర్: 10 సార్లు

డేవిడ్ వార్నర్: 9 సార్లు

విచిత్రం ఏంటంటే ఈ జాబితాలో ఉన్నవారంతా ఐపీఎల్‌లో లెజెండరీ ఓపెనర్లుగా పేరు తెచ్చుకున్నవారే కావడం గమనార్హం.ఇక బ్యాటింగ్ పొజిషన్‌తో సంబంధం లేకుండా ఐపీఎల్ చరిత్రలో ఓవరాల్‌గా అత్యధిక సార్లు డకౌట్ అయిన రికార్డు మాత్రం గ్లెన్ మ్యాక్స్‌వెల్ పేరిట ఉంది. మ్యాక్సీ ఇప్పటివరకు 19 సార్లు సున్నాకే ఔటయ్యారు.ప్రస్తుత సీజన్‌లో రహానే ఫామ్ విషయానికి వస్తే.. కేకేఆర్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన, ఇప్పటివరకు 7 మ్యాచ్‌ల్లో 25.33 యావరేజ్‌తో 152 పరుగులు చేశారు. టీమ్ సక్సెస్‌లో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, ఈ డకౌట్ గణాంకాలు ఆయన అభిమానులను కొంత కలవరపెడుతున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story