IPL 2026: శ్రేయస్ అయ్యర్‌కు బిసిసిఐ షాక్
బిసిసిఐ షాక్

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌ను పంజాబ్ కింగ్స్ ఘన విజయంతో ప్రారంభించినప్పటికీ, ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు మాత్రం చేదు అనుభవం ఎదురైంది. ముల్లాన్‌పూర్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో పంజాబ్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్‌లో నిర్ణీత సమయంలోగా ఓవర్లను పూర్తి చేయనందుకు (Slow Over Rate) బిసిసిఐ అయ్యర్‌పై 12 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఈ సీజన్‌లో క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొన్న మొదటి కెప్టెన్‌గా అయ్యర్ నిలిచారు.ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. ప్రతి జట్టు తమ 20 ఓవర్లను నిర్ణీత సమయానికి పూర్తి చేయాలి. పంజాబ్ కింగ్స్ ఈ నియమాన్ని అతిక్రమించిందని, ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లోని ఆర్టికల్ 2.22 ప్రకారం ఈ జరిమానా విధించినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ సీజన్‌లో ఇది పంజాబ్ జట్టుకు మొదటి తప్పు కావడంతో 12 లక్షలతో సరిపెట్టారు. ఒకవేళ ఇదే తప్పు మళ్ళీ జరిగితే జరిమానా 24 లక్షలకు పెరుగుతుంది. మూడోసారి కూడా రిపీట్ అయితే కెప్టెన్‌పై ఒక మ్యాచ్ నిషేధం పడే అవకాశం కూడా ఉంది.శ్రేయస్ అయ్యర్‌కు ఇలాంటి జరిమానాలు కొత్తేమీ కాదు. గత సీజన్‌లో కూడా స్లో ఓవర్ రేట్ కారణంగా ఆయన రెండుసార్లు ఫైన్ కట్టారు. అప్పట్లో మొత్తం 36 లక్షల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. కాబట్టి రాబోయే మ్యాచుల్లో అయ్యర్ టైమ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.మ్యాచ్ విషయానికి వస్తే.. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ ఒక దశలో వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ యువ సంచలనం కూపర్ కానలీ అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. కేవలం 44 బంతుల్లో 5 సిక్సర్లతో 72 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కానలీ మెరుపులతో పంజాబ్ మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఈ విజయంతో పంజాబ్ శిబిరంలో జోష్ నెలకొన్నప్పటికీ, కెప్టెన్‌కు పడిన జరిమానా మాత్రం కాస్త నిరాశ కలిగించింది.

