ఆర్సీబీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

IPL 2026: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అభిమానులకు తీపి కబురు! ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో 5 హోమ్ మ్యాచ్‌లు ఆడనున్నట్లు మేనేజ్‌మెంట్ అధికారికంగా ప్రకటించింది. చిన్నస్వామి స్టేడియం మాకు సొంత గ్రౌండ్ కన్నా ఎక్కువ. మా గుర్తింపు ఇక్కడే. అభిమానులు ఎల్లప్పుడూ అండగా నిలిచారు. హోమ్ గ్రౌండ్‌లో మ్యాచులను వారు చూడాలి. చర్చలు, అనుమతుల ప్రక్రియ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని ఆర్సీబీ సీఈవో రాజేశ్ మేనన్ తెలిపారు.

RCB ఈ సీజన్‌లో మొత్తం 7 హోమ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా, అందులో 5 మ్యాచ్‌లు బెంగళూరులో, మిగిలిన 2 మ్యాచ్‌లు రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో జరగనున్నాయి.

గత ఏడాది (2025) ఐపీఎల్ విజయోత్సవాల సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాత, భద్రతా కారణాల దృష్ట్యా చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. అయితే స్టేడియంలో మౌలిక సదుపాయాలు , భద్రతను మెరుగుపరిచిన తర్వాత ప్రభుత్వం అనుమతినిచ్చింది.

డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న RCB, మార్చి 28న చిన్నస్వామి స్టేడియంలోనే ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌ను ఆడే అవకాశం ఉంది.ఈసారి కూడా 'ఈ సాలా కప్ నమ్దే' కాస్త 'ఈ సాలా కప్ మత్తే నమ్దే' (ఈసారి కూడా కప్పు మనదే) అని ఫ్యాన్స్ గట్టిగా ఆశిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story