లక్నో సూపర్ జెయింట్స్‌లోకి కేన్ విలియమ్సన్!

IPL 2026: ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్‌ను తమ జట్టులోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. విలియమ్సన్ ఆటగాడిగా కాకుండా లక్నో జట్టుకు స్ట్రాటజిక్ అడ్వైజర్ గా పని చేయనున్నట్లు సమాచారం. జట్టు యజమాని సంజీవ్ గోయెంకా సూచన మేరకు మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2022లో ఐపీఎల్‌లో అడుగుపెట్టిన లక్నో, మొదటి రెండు సీజన్లలో ప్లేఆఫ్స్‌కు చేరింది. అయితే తర్వాతి రెండు సీజన్లలో ఏడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

గత సీజన్ మెంటార్ జహీర్ ఖాన్‌పై ఎల్‌ఎస్‌జీ వేటు వేసింది. బౌలింగ్ కోచ్‌గా భారత మాజీ పేసర్ భరత్ అరుణ్‌ను నియమించింది. ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్ కార్ల్ క్రోవ్ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం జస్టిన్ లాంగర్ ప్రధాన కోచ్‌గా ఉన్నారు. కేన్ విలియమ్సన్ తన అనుభవంతో జట్టును విజయాల బాట పట్టిస్తాడని లక్నో యాజమాన్యం భావిస్తోంది. లక్నో జట్టులో మార్‌క్ర‌మ్‌, మార్ష్‌, పంత్‌, పూర‌న్ వంటి మంచి బ్యాట్స్‌మెన్ ఉన్నప్పటికీ, బౌలింగ్ విభాగం బలహీనంగా మారింది. గత సీజన్‌లో పేసర్లు మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, ఆకాష్ దీప్, ఆవేశ్ ఖాన్ ఆశించినంతగా రాణించలేకపోయారు. విలియమ్సన్ చివరిసారిగా ఐపీఎల్ 2024లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడాడు.

PolitEnt Media

PolitEnt Media

Next Story