IPL 2026: చెపాక్ వేదికగా చివరి మ్యాచ్? ధోనీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్!
ధోనీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్!

IPL 2026: రేపు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో ఏకనా స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈ కీలక మ్యాచ్‌లో క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీ ఆడతాడని తొలుత వార్తలు రావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. జట్టుతో పాటు ధోనీ కూడా లఖ్‌నవూ వెళ్లాడని, మోకాలి గాయం నుంచి కోలుకుని ఫిట్‌గా ఉన్నాడని సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథ్ స్వయంగా వెల్లడించారు. అయితే.. సీన్ కట్ చేస్తే, ఇప్పుడు వినిపిస్తున్న వార్తలు ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేస్తున్నాయి!
తాజా సమాచారం ప్రకారం.. ధోనీ లఖ్‌నవూతో మ్యాచ్‌లో ఆడే అవకాశాలు లేవని తెలుస్తోంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిచి ప్లేఆఫ్స్ రేసులో దూసుకుపోతున్న చెన్నై సూపర్ కింగ్స్.. ప్రస్తుతం జట్టులో ఉన్న విన్నింగ్ కాంబినేషన్ లేదా 'జట్టు కూర్పు'ను చెడగొట్టకూడదని భావిస్తోంది. ఇందుకోసం ధోనీ స్వయంగా తాను లఖ్‌నవూ మ్యాచ్‌లో ఆడనని నిరాకరించినట్లు సమాచారం.
అయితే దీని వెనుక మరో బలమైన ప్రచారం జరుగుతోంది. చెపాక్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో.. సొంత అభిమానుల మధ్య తన 'చివరి' మ్యాచ్ ఆడేలా ధోనీ ప్లాన్ చేసుకున్నట్లు క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఆ మ్యాచ్ తర్వాతే ధోనీ అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే ఊహాగానాలు జోరందుకున్నాయి.

