మాక్స్‌వెల్ డుప్లెసిస్ దూరం..

IPL 2026 Mini Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ కోసం అభిమానులు, ఫ్రాంచైజీలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మినీ వేలం డిసెంబర్ 16న అబుదాబిలో జరగనుంది. ఈ వేలంలో మొత్తం 1,355 మంది ఆటగాళ్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మొత్తం 77 స్లాట్‌లు ఖాళీగా ఉండగా ఇందులో 31 విదేశీ ప్లేయర్ల స్లాట్‌లు ఉన్నాయి.

స్టార్ ఆటగాళ్లు దూరం: మాక్స్‌వెల్‌తో పాటు కీలక ఆల్‌రౌండర్లు ఔట్

ఈసారి ఐపీఎల్‌కు పలువురు స్టార్ ఆటగాళ్లు దూరమవుతుండటం గమనార్హం. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఈ వేలానికి తన పేరును రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. గత సీజన్‌లో పంజాబ్‌కు ఆడిన మ్యాక్సీ కేవలం 48 పరుగులు చేసి, నాలుగు వికెట్లు మాత్రమే తీసి నిరాశపరిచాడు. వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించగా, అతడిని కేకేఆర్ పవర్ కోచ్‌గా నియమించింది. సౌతాఫ్రికా స్టార్ ఫాఫ్‌ డుప్లెసిస్, ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ కూడా ఈ సీజన్‌లో ఆడట్లేదని ప్రకటించారు. వీరిద్దరూ పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఆడతామని తెలిపారు. కాగా కామెరూన్ గ్రీన్, లియామ్ లివింగ్‌స్టోన్ వంటి విదేశీ ఆటగాళ్లు ఈ వేలంలో భారీ ధర పలికే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

హైయెస్ట్ బిడ్ అంచనాలు

వేలంలో ఫ్రాంచైజీల వద్ద ఉన్న పర్స్ వివరాలు:

కోల్‌కతా నైట్‌రైడర్స్ వద్ద అత్యధికంగా రూ.64.3 కోట్లు ఉన్నాయి.

చెన్నై సూపర్ కింగ్స్ వద్ద రూ.43.4 కోట్ల పర్స్ ఉంది.

బరిలో భారత కీలక ఆటగాళ్లు

వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న భారత ఆటగాళ్లలో మయాంక్ అగర్వాల్, కేఎస్ భరత్, దీపక్ హుడా, వెంకటేశ్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, పృథ్వీ షా, ఉమేశ్‌ యాదవ్ వంటి వారు ఉన్నారు. అయితే, వీరి బేస్ ధర ఎంత అనేది ఇంకా తెలియరాలేదు.

రూ. 2 కోట్ల కనీస ధరకు కీలక ప్లేయర్లు

రూ.2 కోట్ల కనీస ధర జాబితాలో రవి బిష్ణోయ్, వెంకటేశ్ అయ్యర్, కామెరూన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, రచిన్ రవీంద్ర, డేవాన్ కాన్వే, డేవిడ్ మిల్లర్, గెరాల్డ్ కొయెట్జీ, అన్రిచ్ నోకియా, వానిందు హసరంగ, జేసన్ హోల్డర్ వంటి అంతర్జాతీయ, భారతీయ స్టార్లు ఉన్నారు. ఐపీఎల్ 2026 మినీ వేలం చాలా ఉత్కంఠగా సాగే అవకాశం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story