IPL 2026: ధోనీ రికార్డ్ బద్దలు.. చరిత్ర సృష్టించిన ఇంగ్లాండ్ ఆల్ రౌండర్
చరిత్ర సృష్టించిన ఇంగ్లాండ్ ఆల్ రౌండర్

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ తొలి రోజే రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. గౌహతిలోని బర్సపరా స్టేడియంలో రాజస్థాన్ బౌలర్లు, ముఖ్యంగా జోఫ్రా ఆర్చర్ ధాటికి చెన్నై టాప్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. పవర్‌ప్లే ముగిసేసరికి 41 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన చెన్నై, ఒక దశలో 12.5 ఓవర్లలో 82 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి అత్యల్ప స్కోరు నమోదు చేసే ప్రమాదంలో పడింది.
అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ జమీ ఓవర్టన్ క్రీజులోకి వచ్చి జట్టును ఆదుకున్నాడు. ఓటమి ఖాయమని తెలిసినా పట్టు వదలకుండా పోరాడి 36 బంతుల్లో 43 పరుగులు చేశాడు. ఈ క్రమంలో జమీ ఓవర్టన్ ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో చెన్నై తరపున 8వ స్థానంలో గానీ, అంతకంటే కింద గానీ బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఎంఎస్ ధోనీ (2024లో ఢిల్లీపై 37 పరుగులు) పేరిట ఉండేది. ఇప్పుడు ఓవర్టన్ ఆ రికార్డును చెరిపివేశాడు.
అంతేకాకుండా, అన్షుల్ కాంబోజ్‌తో కలిసి పదో వికెట్‌కు 33 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇది ఐపీఎల్ చరిత్రలోనే పదో వికెట్‌కు నమోదైన మూడవ అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. ఓవర్టన్ పోరాటంతో చెన్నై జట్టు కనీసం 127 పరుగులైనా చేయగలిగింది. బ్యాటర్లు చేతులెత్తేసిన వేళ, బౌలర్లు ఏమైనా అద్భుతం చేస్తే తప్ప ఈ మ్యాచ్‌లో చెన్నై నిలవడం కష్టమే అనిపిస్తోంది.

