వరుసగా నాలుగో విక్టరీ

IPL 2026: ఐపీఎల్-19లో రాజస్థాన్ రాయల్స్ జోరు కొనసాగుతోంది! శుక్రవారం జరిగిన హోరాహోరీ పోరులో బెంగళూరుపై 6 వికెట్ల తేడాతో రాయల్స్ ఘనవిజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ రజత్ పటీదార్ 40 బంతుల్లోనే 63 పరుగులతో జట్టును ముందుండి నడిపించగా.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 16 బంతుల్లోనే 7 ఫోర్లతో 32 పరుగులు చేసి మెరుపులు మెరిపించారు.

202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌ను కుర్రాళ్లు చెలరేగి ఆడారు. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు! కేవలం 26 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 78 పరుగులు పిండుకొని బెంగళూరు బౌలర్లను వణికించాడు. ఈ మ్యాచ్‌‌‌‌లో వైభవ్ సూర్యవంశీ 15 బాల్స్‌‌‌‌లోనే ఫిఫ్టీ కొట్టాడు. ఐపీఎల్‌‌‌‌లో థర్డ్ జాయింట్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ఇది. యశస్వి జైస్వాల్ (13 బాల్స్‌‌‌‌) టాప్‌‌‌‌లో ఉన్నాడు. సూర్యవంశీకి ఈ సీజన్‌‌‌‌లో ఇది రెండో ఫిఫ్టీ కాగా.. రెండుసార్లు 15 బాల్స్‌‌‌‌లోనే ఈ మార్కు అందుకున్నాడు. మరోవైపు ధ్రువ్ జురెల్ క్లాస్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. 43 బంతుల్లో 81 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి, జట్టుకు విజయాన్ని అందించాడు.రాజస్థాన్ రాయల్స్ మరో 2 ఓవర్లు మిగిలి ఉండగానే, అంటే 18 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. తన మెరుపు ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పిన వైభవ్ సూర్యవంశీకి 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story