IPL 2026: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ఓటమి కంటే.. ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్య తీసుకుంటున్న నిర్ణయాలే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఓటమికి హార్దిక్ పాండ్య కెప్టెన్సీ వైఫల్యమే కారణమని టీమ్ ఇండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు గ్రౌండ్‌లో పాండ్య ఏం చేస్తున్నాడు? అంటూ అశ్విన్ సూటిగా ప్రశ్నించారు.

మ్యాచ్ గమనాన్ని మార్చే కీలక సమయంలో హార్దిక్ తీసుకున్న ఒక నిర్ణయం అశ్విన్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆర్సీబీ బ్యాటర్ రజత్ పాటీదార్ క్రీజులో ఉన్నప్పుడు.. స్పిన్నర్ మయాంక్ మార్కండేకు బౌలింగ్ ఇవ్వడం ఏంటని అశ్విన్ నిలదీశారు. సాధారణంగా రజత్ పాటీదార్ స్పిన్నర్లపై విరుచుకుపడతారనే విషయం అందరికీ తెలిసిందే. అటువంటిది, ఒక సెట్ బ్యాటర్ ముందు స్పిన్నర్‌ను ప్రయోగించడం ఆత్మహత్యతో సమానమని అశ్విన్ అభిప్రాయపడ్డారు.

అశ్విన్ అన్నట్లే.. మయాంక్ మార్కండే వేసిన ఆ రెండు ఓవర్లు మ్యాచ్ ఫలితాన్ని తలకిందులు చేశాయి. కేవలం 12 బంతుల్లోనే మార్కండే ఏకంగా 40 పరుగులు సమర్పించుకున్నాడు. అక్కడే ఆర్సీబీకి కావాల్సిన మొమెంటం దక్కిందని, హార్దిక్ పాండ్య తెలివైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్లే ముంబై మూల్యం చెల్లించుకుందని అశ్విన్ అసంతృప్తి వ్యక్తం చేశారు."హార్దిక్ పాండ్య కెప్టెన్సీపై గత కొన్ని రోజులుగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అశ్విన్ లాంటి సీనియర్ క్రికెటర్ కూడా గొంతు కలపడంతో ఇది మరింత చర్చనీయాంశమైంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story