IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్‌కు చేరుకుంది! ప్లేఆఫ్స్ రేసు ఇప్పుడు రసవత్తరంగా మారింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తు చేసిన గుజరాత్ టైటాన్స్.. అనూహ్యంగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. వరుసగా ఐదు విజయాలతో గుజరాత్ దూసుకుపోతుండటంతో మిగిలిన జట్లలో టెన్షన్ మొదలైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆర్సీబీ, సన్‌రైజర్స్, పంజాబ్ కింగ్స్ తర్వాతి స్థానాల్లో ఉండగా.. సీఎస్‌కే, రాజస్థాన్ రాయల్స్ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి.

ఈ క్రమంలో టాప్-4 రేసులో ఉన్న జట్లను మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ హెచ్చరించారు. ఏ జట్టూ తమ స్థానం సురక్షితమని భావించవద్దని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యంగా అహ్మదాబాద్‌లో గుజరాత్ చేతిలో ఓడిపోయిన సన్‌రైజర్స్‌కు కైఫ్ కీలక సూచనలు చేశారు.

గుజరాత్ మ్యాచ్ ఓటమితో సన్‌రైజర్స్ కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ, వారు పరిస్థితులకు తగ్గట్టుగా మారాలి. తదుపరి మ్యాచ్‌లో చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడటం ఎస్‌ఆర్‌హెచ్‌కు అతిపెద్ద సవాల్. సొంత మైదానంలో సీఎస్‌కేను ఎదుర్కోవడం అంత సులభం కాదు. ఆ తర్వాత హైదరాబాద్‌లో రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో తలపడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచులు సన్‌రైజర్స్‌కు అత్యంత క్లిష్టమైనవి" అని కైఫ్ విశ్లేషించారు.గుజరాత్ చేతిలో చేసిన పొరపాట్లను డ్రెస్సింగ్ రూమ్‌లో చర్చించుకుని సరిదిద్దుకోవాలని కైఫ్ సూచించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story