IPL 2026: రోహిత్-రికెల్టన్ విధ్వంసం: ముంబై ఇండియన్స్ చరిత్రలో సరికొత్త
ముంబై ఇండియన్స్ చరిత్రలో సరికొత్త

IPL 2026: ముంబై ఇండియన్స్ ఓపెనర్లు రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పై సరికొత్త రికార్డును సృష్టించారు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 143 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ చరిత్రలోనే ఏ వికెట్‌కైనా మూడుసార్లు 100కు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన తొలి జోడీగా వీరు చరిత్రకెక్కారు.
గతంలో రోహిత్ శర్మ - ఇషాన్ కిషన్, పార్థివ్ పటేల్ - లెండిల్ సిమన్స్ మరియు అంబటి రాయుడు - సచిన్ టెండూల్కర్ జంటలు చెరో రెండు సెంచరీ భాగస్వామ్యాలను నమోదు చేయగా, రికెల్టన్ - రోహిత్ జోడీ ఇప్పుడు వారిని అధిగమించింది. అంతేకాకుండా, వీరి 143 పరుగుల భాగస్వామ్యం ముంబై ఇండియన్స్ తరపున ఏ వికెట్‌కైనా నాలుగో అత్యధిక భాగస్వామ్యంగా మరియు ఓపెనర్ల పరంగా మూడో అత్యుత్తమ స్కోరుగా నమోదైంది.
ఈ మ్యాచ్ విశేషాల్లోకి వెళితే.. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత ఓవర్లలో 228/5 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ కేవలం 21 బంతుల్లో 63 పరుగులతో విరుచుకుపడగా, మిచెల్ మార్ష్ 44 పరుగులు జోడించాడు. పూరన్ కేవలం 16 బంతుల్లోనే ఎనిమిది సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేయడం విశేషం. అయితే కోర్బిన్ బాష్ కీలక వికెట్లు తీసి లక్నో జోరుకు బ్రేకులు వేశారు. చివర్లో ఐడెన్ మార్క్రామ్ (31*), హిమ్మత్ సింగ్ (40*) రాణించడంతో లక్నో భారీ స్కోరు సాధించింది.
అనంతరం 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు రోహిత్, రికెల్టన్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. గాయం నుంచి కోలుకొని వచ్చిన రోహిత్ శర్మ తనదైన శైలిలో 7 సిక్సర్లు, 6 ఫోర్లతో 84 పరుగులు చేయగా, రికెల్టన్ 83 పరుగులతో మెరిశాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 143 పరుగులు జోడించి విజయాన్ని సులభతరం చేశారు. చివర్లో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ త్వరగా అవుట్ అయినప్పటికీ, నమన్ ధీర్ మరియు విల్ జాక్స్ మరో వికెట్ పడకుండా 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు. ఈ ఆరు వికెట్ల విజయంతో ముంబై ఇండియన్స్ టోర్నీలో కీలక విజయాన్ని అందుకుంది.

