IPL 2026: ఐపీఎల్ చరిత్రలో కోల్‌కతా నైట్ రైడర్స్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. దశాబ్ద కాలానికి పైగా తన స్పిన్ మాయాజాలంతో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతున్న నరైన్.. అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.ఆదివారం ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టడం ద్వారా.. ఐపీఎల్‌లో ఒకే ఫ్రాంఛైజీ తరపున 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నయా హిస్టరీ క్రియేట్ చేశాడు. 2012 నుండి కేకేఆర్ జట్టుకే ఆడుతున్న నరైన్..అద్భుతమైన ఫామ్‌ను ఈ రికార్డుతో చాటిచెప్పాడు.

అంతేకాదు ఐపీఎల్ చరిత్రలో 200 వికెట్ల మార్కును అందుకున్న తొలి విదేశీ బౌలర్‌గా కూడా నరైన్ రికార్డు సృష్టించాడు. ఓవరాల్‌గా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో యుజ్వేంద్ర చాహల్ (228), భువనేశ్వర్ కుమార్ (215) తర్వాత మూడో స్థానంలో నిలిచి తన సత్తా చాటాడు.

మ్యాచ్ విషయానికి వస్తే:

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 19 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ట్రావిస్ హెడ్ 61 పరుగులు, ఇషాన్ కిషన్ 42 పరుగులతో రాణించినా.. నరైన్ ,వరుణ్ చక్రవర్తిల స్పిన్ ధాటికి మిడిల్ ఆర్డర్ కుప్పకూలింది. వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు తీయగా, నరైన్ రెండు కీలక వికెట్లతో హైదరాబాద్ నడ్డి విరిచాడు. అనంతరం ఈ లక్ష్యాన్ని కేకేఆర్ 18.2 ఓవర్లలోనే ఛేదించి ఘనవిజయం సాధించింది.టీమ్ గెలవడమే కాకుండా.. నరైన్ ఇలాంటి అరుదైన రికార్డు సాధించడంతో కేకేఆర్ క్యాంప్‌లో పండుగ వాతావరణం నెలకొంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story