సన్ రైజర్స్ చెత్త రికార్డ్

IPL 2026: సొంత గడ్డపై సింహంలా గర్జిస్తుందనుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలై.. కొన్ని చెత్త రికార్డులను మూటగట్టుకుంది. ఆరంభం నుంచే తడబడిన ఆరెంజ్ ఆర్మీ.. పరుగుల కోసం చెమటోడ్చడమే కాకుండా, ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప స్కోరు చేసిన జట్ల జాబితాలోకి చేరిపోయింది.

ముఖ్యంగా తొలి 10 ఓవర్లలో సన్‌రైజర్స్ ఆట తీరు అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. మొదటి 10 ఓవర్లు ముగిసేసరికి SRH కేవలం 35 పరుగులు మాత్రమే చేసి 4 కీలక వికెట్లను కోల్పోయింది. ఐపీఎల్ చరిత్రలో తొలి 10 ఓవర్లలో అత్యల్ప స్కోరు చేసిన జట్ల జాబితాలో హైదరాబాద్ ఇప్పుడు నాలుగో స్థానంలో నిలిచింది.గతంలో డెక్కన్ ఛార్జర్స్‌పై కేకేఆర్ 31 పరుగులు, ఆర్సీబీపై రాజస్థాన్ రాయల్స్ 32 పరుగులు, పంజాబ్‌పై ముంబై ఇండియన్స్ 32 పరుగులు చేసి టాప్-3లో ఉండగా.. ఇప్పుడు ఆ చెత్త రికార్డుల సరసన 35 పరుగులతో SRH నిలిచింది.

కేవలం 10 ఓవర్లే కాదు.. పవర్ ప్లేలో కూడా సన్‌రైజర్స్ బ్యాటర్లు చేతులెత్తేశారు. మొదటి 6 ఓవర్లలో కేవలం 22 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయారు. సన్‌రైజర్స్ చరిత్రలో పవర్ ప్లేలో ఇది నాలుగో లోయెస్ట్ స్కోర్ కావడం గమనార్హం. గతంలో రాజస్థాన్‌పై 14 పరుగులు, పంజాబ్‌పై 20 పరుగులు, మళ్లీ రాజస్థాన్‌పైనే 21 పరుగులు చేసిన చరిత్ర ఉన్న SRH.. ఇప్పుడు మరోసారి అదే తరహా పేలవ ప్రదర్శనను పునరావృతం చేసింది.

పిచ్ కండిషన్స్ అర్థం చేసుకోవడంలో విఫలమవ్వడం, కీలక సమయంలో వికెట్లు పారేసుకోవడం సన్‌రైజర్స్‌ను కోలుకోలేని దెబ్బతీశాయి. మరి ఈ చెత్త రికార్డుల నుండి పాఠాలు నేర్చుకుని, తర్వాతి మ్యాచ్‌లలో ఆరెంజ్ ఆర్మీ పుంజుకుంటుందో లేదో వేచి చూడాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story