నేటి మ్యాచ్‌లో గెలిచేదెవరు?

IPL 2026: ఐపీఎల్ 2026లో మరో భీకర పోరుకు వేదిక సిద్ధమైంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలోసన్‌రైజర్స్ హైదరాబాద్, విజయాల పరంపరను కొనసాగిస్తున్న రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఇరు జట్లలోనూ విధ్వంసకర బ్యాటర్లు ఉండటంతో.. ఇవాళ మైదానంలో పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తోంది.

ముందుగా రాజస్థాన్ రాయల్స్ గురించి చెప్పుకుంటే.. ఈ సీజన్‌లో వారి దూకుడు చూస్తుంటే ప్రత్యర్థి జట్లకు చెమటలు పడుతున్నాయి. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ వరుస విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది ఆర్ఆర్. ముఖ్యంగా యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్‌తో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంటే.. మరోవైపు యశస్వి జైస్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఈ ఓపెనింగ్ జోడీని కట్టడి చేయడం సన్‌రైజర్స్ బౌలర్లకు అతిపెద్ద సవాలుగా మారనుంది.

మరోవైపు, ఆరెంజ్ ఆర్మీ సన్‌రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి ప్రస్తుతం కాస్త ఆందోళనకరంగా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట ఓటమి చవిచూడటంతో పాయింట్ల వేటలో వెనుకబడింది. అయితే, సొంత గడ్డపై మ్యాచ్ జరుగుతుండటం వారికి కలిసొచ్చే అంశం. ఉప్పల్ స్టేడియంలో అభిమానుల మద్దతు మధ్య తిరిగి ఫామ్‌లోకి రావాలని, పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలని ఎస్‌ఆర్‌హెచ్ ఉవ్విళ్లూరుతోంది. నేటి మ్యాచ్‌లో గెలిచి తమ సత్తా చాటాలని పక్కా ప్లాన్‌తో బరిలోకి దిగుతోంది.

ఒకవైపు తిరుగులేని విజయాలతో రాజస్థాన్.. మరోవైపు గెలుపు కోసం ఆకలితో ఉన్న హైదరాబాద్! మరి ఇవాళ ఉప్పల్ గడ్డపై విజేతగా నిలిచేది ఎవరు? జైస్వాల్ పవర్‌ప్లేలో బాదుతాడా? లేక హైదరాబాద్ బౌలర్లు మ్యాచ్‌ను మలుపు తిప్పుతారా? చూద్దాం.

PolitEnt Media

PolitEnt Media

Next Story