IPL 2026: పంజాబ్‌తో పోరు.. చెన్నై పుంజుకుంటుందా?
చెన్నై పుంజుకుంటుందా?

IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభం చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్‌పై ఘోర పరాజయాన్ని చవిచూసిన చెన్నై, ఇప్పుడు శుక్రవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగే పోరులో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ముఖ్యంగా కుర్రాళ్లతో నిండిన చెన్నై జట్టుకు ఇది ఒక సవాల్ లాంటిదే. గత మ్యాచ్‌లో కేవలం 127 పరుగులకే పరిమితమైన చెన్నైని, రాజస్థాన్ బ్యాటర్లు ఊచకోత కోస్తూ కేవలం 12.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించేశారు. ఈ నేపథ్యంలో పంజాబ్‌పై గెలవాలంటే చెన్నై అన్ని విభాగాల్లోనూ అద్భుతంగా పుంజుకోవాల్సి ఉంది.
ఈ సీజన్‌లో చెన్నై జట్టు తన సొంత గడ్డపై ఆడుతున్న మొదటి మ్యాచ్ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అరంగేట్రం మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన సంజు శాంసన్, ఈసారి చెన్నై పిచ్‌పై చెలరేగిపోతాడని యాజమాన్యం ఆశిస్తోంది. అలాగే యువ బ్యాటర్ కార్తీక్ శర్మ కూడా తన ఆటతీరును మెరుగుపరుచుకోవాలని జట్టు భావిస్తోంది. అయితే గాయం కారణంగా మొదటి మ్యాచ్‌కు దూరమైన విధ్వంసకర బ్యాటర్ బ్రెవిస్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది.
బౌలింగ్ విభాగంలో కూడా చెన్నై కాస్త ఆందోళన చెందుతోంది. గత మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ధాటికి విలవిల్లాడిన మ్యాట్ హెన్రీ, నూర్ అహ్మద్ ఈసారి ఏ మేరకు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తారో చూడాలి. మరోవైపు పంజాబ్ కింగ్స్ మాత్రం ఫుల్ జోష్‌లో ఉంది. గుజరాత్‌పై అద్భుత విజయం సాధించి మంచి ఊపు మీదున్న పంజాబ్‌ను అడ్డుకోవడం చెన్నైకి అంత తేలికైన పని కాదు. చెన్నై తన పాత వైభవాన్ని చాటుకుంటుందో లేదో తెలియాలంటే రేపటి మ్యాచ్ వరకు ఆగాల్సిందే.

