IPL: రికార్డు స్థాయిలో ఐపీఎల్ బ్రాండ్ విలువ.. టాప్ ప్లేస్‌లో ఆర్సీబీ
టాప్ ప్లేస్‌లో ఆర్సీబీ

IPL: ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన టీ20 లీగ్ ఐపీఎల్ సరికొత్త మైలురాయిని అధిగమించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ బ్రాండ్ విలువ తొలిసారిగా 20 బిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. ఇక జట్ల వారీగా చూస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టాప్ ప్లేస్‌ను దక్కించుకుంది.
ప్రముఖ వాల్యుయేషన్ సంస్థ 'హౌలిహాన్ లోకి' (Houlihan Lokey) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. 2026 సంవత్సరానికి గాను ఐపీఎల్ మొత్తం బిజినెస్ విలువ ఏకంగా 20.6 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 1.90 లక్షల కోట్లు) చేరుకుంది. గతేడాదితో పోలిస్తే లీగ్ వ్యాపార విలువ 11.4 శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది.
మూడేళ్ల కిందట ఐపీఎల్ విలువ 15.4 బిలియన్ డాలర్లు (రూ. 1.47 లక్షల కోట్లు) ఉండగా..2024 నాటికి 16.4 బిలియన్ డాలర్లకు,2025 నాటికి 18.5 బిలియన్ డాలర్లకు పెరిగి.. ఇప్పుడు ఏకంగా 20 బిలియన్ డాలర్ల మార్కును దాటేసింది.
డియా హక్కులు (Media Rights), సరికొత్త స్పాన్సర్‌షిప్‌లు, స్టేడియం టికెట్ల విక్రయాలు అన్నీ కలిపి లీగ్ మొత్తం ఆదాయం 1.8 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 1.70 లక్షల కోట్లు) పైనే ఉంటుందని హౌలిహాన్ కి స్టడీ అంచనా వేసింది.
టాప్ బ్రాండ్‌గా ఆర్సీబీ
ఇక జట్ల బ్రాండ్ వాల్యూ పరంగా.. వరుసగా రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన కనబరిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తొలి స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఆర్సీబీ బ్రాండ్ విలువ 300 మిలియన్ డాలర్లకు పైగా ఉంది. ఆర్సీబీ తర్వాత వరుసగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, దిల్లీ క్యాపిటల్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్లు ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.

