గెలిచేదెవరు.?

IPL Clash Today: ఈరోజు కోల్‌కతా వేదికగా ఒక ఆసక్తికర పోరు జరగనుంది. ఈడెన్ గార్డెన్స్ మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ , లక్నో సూపర్ జెయింట్స్ జట్లు రాత్రి 7:30 గంటలకు తలపడనున్నాయి. అజింక్య రహానే నేతృత్వంలోని కేకేఆర్.. రిషబ్ పంత్ సారధ్యంలోని ఎల్‌ఎస్‌జీని ఢీకొట్టడానికి సర్వం సిద్ధమైంది.

ఈ సీజన్‌లో ఇప్పటివరకు రెండు జట్ల ప్రయాణం భిన్నంగా సాగింది. లక్నో సూపర్ జెయింట్స్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో ఒక విజయాన్ని అందుకుంది. గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై ఘనవిజయం సాధించి మంచి ఊపు మీదున్న ఎల్‌ఎస్‌జీ.. అదే జోరును నేడు కూడా కొనసాగించాలని భావిస్తోంది. బ్యాటింగ్ , బౌలింగ్‌లో సమతూకంతో కనిపిస్తున్న లక్నో.. కేకేఆర్‌ను వారి సొంత గడ్డపైనే దెబ్బకొట్టాలని ప్లాన్ చేస్తోంది.

మరోవైపు, ఆతిథ్య జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉంది. ఈ సీజన్‌లో కేకేఆర్ ఇంకా బోణీ కొట్టలేదు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో ఓడిపోయి పాయింట్ల పట్టికలో వెనుకబడి ఉంది. మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. ముఖ్యంగా కేకేఆర్ బౌలింగ్ విభాగం భారీగా పరుగులు సమర్పించుకుంటోంది. ఈ రోజు మ్యాచ్ ద్వారా ఎలాగైనా గెలుపు బాట పట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.

కేకేఆర్ ఫ్యాన్స్‌కు ఒక గుడ్ న్యూస్! అనారోగ్యం కారణంగా గత మ్యాచ్‌కు దూరమైన స్టార్ ఆల్ రౌండర్ సునీల్ నరైన్ ఈరోజు బరిలోకి దిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అతను ప్రాక్టీస్ సెషన్లలో కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. అయితే, ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు వేలికి గాయమైన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఆడతారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. వరుణ్ గైర్హాజరీలో కేకేఆర్ స్పిన్ విభాగం బలహీనపడే ప్రమాదం ఉంది.మరి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్‌తో కేకేఆర్ మొదటి విజయాన్ని అందుకుంటుందా? లేక లక్నో తన జైత్రయాత్రను కొనసాగిస్తుందా? తెలుసుకోవాలంటే రాత్రి 7:30 వరకు వేచి చూడాల్సిందే.

PolitEnt Media

PolitEnt Media

Next Story