వెళ్లిపోతా: సంజూ శాంసన్

IPL: రాజస్థాన్ రాయల్స్ జట్టు నుంచి తనను విడుదల చేయాలని లేదా మరో జట్టుకు ట్రేడ్ చేయాలని సంజూ శాంసన్ ఆ జట్టు ప్రాంఛైజీని కోరాడు. సంజూ శాంసన్‌కు, రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యానికి మధ్య కొన్ని విషయాల్లో విభేదాలు తలెత్తాయని ప్రచారం జరుగుతోంది.

సంజూ శాంసన్ ఓపెనర్‌గా ఆడటానికి ఆసక్తి చూపుతున్నాడు. అయితే, యువ ఓపెనర్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ రాణిస్తున్న కారణంగా, శాంసన్‌ను మూడో స్థానంలో ఆడించాల్సి వచ్చింది. ఇది అతను జట్టు నుంచి వెళ్లిపోతున్నాడని తెలుస్తోంది. అయితే సంజూ శాంసన్ తో రాజస్థాన్ రాయల్స్‌తో 2027 వరకు అగ్రిమెంట్ ఉంది. కాబట్టి అతన్ని విడుదల చేయాలా వద్దా అనే తుది నిర్ణయం ఫ్రాంచైజీ చేతుల్లోనే ఉంది. ప్రస్తుతానికి, రాజస్థాన్ రాయల్స్ అతనిని కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ వంటి కొన్ని జట్లు సంజూ శాంసన్‌ను తమ జట్టులోకి తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై ఇంకా స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. వచ్చే ఐపీఎల్ సీజన్ ట్రేడింగ్ విండో గడువు వరకు దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున 4000 పరుగులు సాధించిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

PolitEnt Media

PolitEnt Media

Next Story