IPL Mini Auction: ఐపీఎల్ మినీ వేలం..అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్లు వీళ్లే
అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్లు వీళ్లే

IPL Mini Auction: 2026 ఐపీఎల్ (IPL) మినీ వేలంఅబుదాబిలో ఘనంగా జరిగింది. ఈ వేలంలో విదేశీ ఆటగాళ్లతో పాటు అన్-క్యాప్డ్ (Uncapped) ఇండియన్ ప్లేయర్స్ ఊహించని ధరకు అమ్ముడుపోయి అందరినీ ఆశ్చర్యపరిచారు.ఈ మినీ వేలం యూఏఈలోని అబుదాబిలో ఉన్న ఎతిహాద్ అరేనాలో జరిగింది.జట్ల వారీగా మిగిలిన స్లాట్లు:ఈ వేలంలో మొత్తం 77 స్లాట్లను 10 ఫ్రాంచైజీలు భర్తీ చేశాయి. ఇందులో కోల్‌కతా అత్యధికంగా 13 మందిని కొనుగోలు చేసింది.
కామెరూన్ గ్రీన్: కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) రూ. 25.20 కోట్లు
మతీషా పతిరానా: కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)రూ.18.00 కోట్లు
ప్రశాంత్ వీర్ :చెన్న సూపర్ కింగ్స్ (CSK) రూ.14.20 కోట్లు
కార్తీక్ శర్మ : చెన్నై సూపర్ కింగ్స్ (CSK)రూ14.20 కోట్లు
లియామ్ లివింగ్‌స్టోన్: సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH)రూ.13.00 కోట్లు
ఆస్ట్రేలియా ఆల్-రౌండర్ కామెరూన్ గ్రీన్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా నిలిచారు. కేకేఆర్ ఇతడిని రూ.25.20 కోట్లకు దక్కించుకుంది. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మలను చెన్నై సూపర్ కింగ్స్ చెరో రూ14.20 కోట్లకు కొనుగోలు చేసి సంచలనం సృష్టించింది. ఒక అన్-క్యాప్డ్ ప్లేయర్‌కు ఇంత పెద్ద మొత్తం లభించడం ఇదే తొలిసారి. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ వేలంలో ఇంగ్లాండ్ హిట్టర్ లియామ్ లివింగ్‌స్టోన్ (రూ13 కోట్లు), శివమ్ మావి (రూ75 లక్షలు) వంటి కీలక ఆటగాళ్లను తీసుకుంది. తొలి రౌండ్లలో పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్ వంటి ప్లేయర్లు అమ్ముడుపోలేదు. అయితే చివరి నిమిషంలో పృథ్వీ షాను ఢిల్లీ క్యాపిటల్స్ (రూ75 లక్షలు), సర్ఫరాజ్ ఖాన్‌ను సీఎస్‌కే (రూ75 లక్షలు) దక్కించుకున్నాయి.

