దుబాయ్ లో చిక్కుకున్న సింధు

తాను సేఫ్ గా ఉన్నానని బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తెలిపారు. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ఉద్రిక్తతల మధ్య దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకుపోయిన ఆమె, అక్కడ జరిగిన ఒక పేలుడు గురించి కూడా వివరించారు.సింధు , ఆమె టీమ్ ఎయిర్‌పోర్ట్‌లో వేచి ఉన్న సమయంలో, వారు ఉన్న చోటుకు అతి సమీపంలోనే ఒక పేలుడు సంభవించింది. ఆ సమయంలో తన కోచ్ పొగ , శిధిలాలకు చాలా దగ్గరగా ఉన్నారని, వెంటనే అక్కడి నుండి సురక్షిత ప్రాంతానికి పరుగులు తీయాల్సి వచ్చిందని ఆమె వివరించారు. ఆ క్షణం చాలా భయానకంగా అనిపించిందని ఆమె పేర్కొన్నారు.

Iran–Israel War: పేలుడు తర్వాత దుబాయ్ ఎయిర్‌పోర్ట్ సిబ్బంది మరియు స్థానిక అధికారులు సింధును, ఆమె బృందాన్ని మరింత సురక్షితమైన ప్రదేశానికి (Secure Location) తరలించారు. ప్రస్తుతం తామంతా క్షేమంగానే ఉన్నామని ఆమె భరోసా ఇచ్చారు.ఈ కష్టకాలంలో తనకు తోడుగా నిలిచిన దుబాయ్‌లోని భారత హైకమిషన్ (Indian High Commission) అధికారులకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వారు నిరంతరం సంప్రదిస్తూ భద్రతను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.

సింధు బెంగళూరు నుండి బర్మింగ్‌హామ్‌లో జరగబోయే 'ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్' టోర్నమెంట్‌లో పాల్గొనడానికి వెళ్తూ దుబాయ్‌లో ట్రాన్సిట్ (విరామం) కోసం ఆగారు. కానీ యుద్ధం కారణంగా గగనతలం మూసివేయడంతో అక్కడే చిక్కుకుపోయారు. ఈ టోర్నమెంట్ మార్చి 3 నుండి ప్రారంభం కావాల్సి ఉంది.

"ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. ఆకాశంలో వినిపిస్తున్న శబ్దాలు, యుద్ధ క్షిపణుల దాడులు చూస్తుంటే చాలా భయం వేస్తోంది. సాధారణ జీవితం ఎంత సున్నితమైనదో ఇలాంటి సమయాల్లోనే తెలుస్తుంది."

ప్రస్తుతం సింధు తండ్రి పి.వి. రమణ కూడా స్పందిస్తూ, తన కుమార్తెతో మాట్లాడానని, ఎంబసీ వారు ఆమెకు ఒక హోటల్‌లో వసతి ఏర్పాటు చేశారని ధ్రువీకరించారు.యుద్ధం వల్ల ఫ్లైట్స్ రద్దయిన నేపథ్యంలో, ఆమె సకాలంలో బర్మింగ్‌హామ్ చేరుకోగలరా లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఆమె క్షేమంగా తిరిగి రావాలని కోరుకుందాం.

PolitEnt Media

PolitEnt Media

Next Story