Sunrisers Hyderabad (SRH): సన్ రైజర్స్ కెప్టెన్ గా ఇషాన్ కిషన్
కెప్టెన్ గా ఇషాన్ కిషన్

Sunrisers Hyderabad (SRH): సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) యాజమాన్యం ఇషాన్ కిషన్‌ను జట్టు కెప్టెన్‌గా అధికారికంగా ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ వెన్నునొప్పి గాయం కారణంగా ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభ మ్యాచులకు అందుబాటులో ఉండటం లేదు. దీంతో అతని స్థానంలో ఇషాన్ కిషన్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. జట్టులోని మరో కీలక ఆటగాడు, యువ ఓపెనర్ అభిషేక్ శర్మను వైస్ కెప్టెన్‌గా నియమించారు. ఇటీవల ముగిసిన T20 ప్రపంచ కప్ 2026లో ఇషాన్ కిషన్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఇటీవల ముగిసిన T20 ప్రపంచ కప్ 2026లో ఇషాన్ కిషన్ 317 పరుగులతో (స్ట్రైక్ రేట్ 193+) భారత్ తరపున రెండో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. అలాగే గత ఏడాది జార్ఖండ్ జట్టును 'సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ' విజేతగా నిలిపి తన కెప్టెన్సీ సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు.ఈ ఫామ్‌ను దృష్టిలో ఉంచుకుని మేనేజ్‌మెంట్ అతనికి పగ్గాలు ఇచ్చింది. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాల్లో ఉన్న ఈ ఇద్దరు యువ ఆటగాళ్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును ముందుకు నడిపించనున్నారు.మార్చి 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీతో జరిగే తొలి మ్యాచ్‌తో ఇషాన్ కిషన్ తన కెప్టెన్సీ ప్రస్థానాన్ని ప్రారంభించనున్నాడు.
ఇషాన్ కిషన్ యువకుడు, దూకుడున్న వికెట్ కీపర్ బ్యాటర్. ముంబై ఇండియన్స్‌లో రోహిత్ శర్మ వంటి దిగ్గజాల వద్ద ఆడిన అనుభవం అతనికి ఉంది. అలాగే, వికెట్ల వెనుక ఉండి గేమ్ మొత్తాన్ని గమనించే అవకాశం ఉంటుంది.

