టార్గెట్ టైటిల్

Japan Open: ఇవాళ్టి నుంచి జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీ ప్రారంభమవుతుంది. ఇండియా స్టార్ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్‌‌‌‌, సాత్విక్ సాయిరాజ్‌‌‌‌–చిరాగ్ షెట్టి, అనుపమ ఉపాధ్యాయ ఈ టోర్నీలో పోటీపడనున్నారు. స్టార్ ప్లేయర్లు సింధు, లక్ష్య సేన్ ఈ టోర్నీతో అయినా తిరిగి ఫామ్ అందుకోవాలని చూస్తున్నారు.

డబుల్స్ టాప్ జోడీ సాత్విక్‌‌‌‌–చిరాగ్‌‌‌‌ టైటిల్ గెలిచి తమ నిరీక్షణకు తెరదించాలని పట్టుదలగా ఉంది. సింగిల్స్ ప్లేయర్లు ‌‌‌‌‌‌‌ పీవీ సింధు తొలి రౌండ్ మ్యాచ్‌‌‌‌లో కొరియా ప్లేయర్ సిమ్ యు జిన్‌‌‌‌ను ఢీకొట్టనుంది.

ఈ మ్యాచ్‌లను JioCinema యాప్ , వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూడవచ్చు. అలాగే స్టార్ స్పోర్ట్స్ 3, స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ 1 టీవీ ఛానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయబడతాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story