Jasprit Bumrah: టీమిండియా కెప్టెన్సీ ఇస్తానంటే నేనే వద్దన్నా...
నేనే వద్దన్నా...

Jasprit Bumrah: టీమిండియా టెస్టు కొత్త కెప్టెన్ గా బీసీసీఐ శుభ్ మన్ గిల్ ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.అయితే రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత కెప్టెన్సీ రేసులో గిల్ తో పాటు బుమ్రా పేరు కూడా వినిపించింది.చివరగా బీసీసీఐ గిల్ కు అప్పచెప్పింది. అయితే లేటెస్ట్ గా కెప్టెన్సీపై బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బీసీసీఐ తనకు కెప్టెన్సీ ఇస్తానంటే తానే వద్దన్నానని చెప్పాడు.
ఇందులో ఎలాంటి కట్టుకథలు లేవు. నాకు కెప్టెన్సీ ఇవ్వలేరన్న వార్తలు, వివాదాలు అవాస్తవం. ఐపీఎల్ సమయంలోనే ఇంగ్లండ్‌తో రాబోయే ఐదు టెస్టుల సిరీస్‌లో నా వర్క్‌లోడ్ గురించి బీసీసీఐతో చర్చించాను. నా వెన్ను గాయాన్ని పర్యవేక్షించిన ఎక్స్పర్ట్స్, నాకు సర్జరీ చేసిన డాక్టర్‌తో కూడా మాట్లాడాను. కెరీర్‌ను దృష్టిలో పెట్టుకుని పనిభారం విషయంలో ఎంత తెలివిగా ఉండాలో వాళ్లు నాకు స్పష్టంగా చెప్పారు. ఆ చర్చల తర్వాత నేను మరింత జాగ్రత్తగా ఉండాలని డిసైడయ్యా. వెంటనే బీసీసీఐకి ఫోన్ చేసి కెప్టెన్సీ కోసం నన్ను పరిగణించవద్దని నేనే చెప్పా అని బుమ్రా చెప్పుకొచ్చాడు.
