ఇంతకీ ఎవరీమే.

Jemimah Rodrigues: వుమెన్స్ వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో అద్భుతమైన ఆటతీరుతో ఇండియాను ఫైనల్ కు చేర్చిన జెమీమా రోడ్రిగ్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారారు.ఆమె ఎవరు..ఆమె రికార్డ్స్ గురించి ఆరాదీస్తున్నారు.పూర్తి పేరు జెమీమా జెస్సికా రోడ్రిగ్స్, , 2000 సెప్టెంబర్ 5న మహారాష్ట్రలో జన్మించారు. బ్యాటర్ (కుడిచేతి వాటం) , పార్ట్-టైమ్ రైట్-ఆర్మ్ ఆఫ్-స్పిన్ బౌలర్. ఇండియా మహిళల క్రికెట్ జట్టుకు 20187 నుంచి ఆడుతోంది

దేశవాళీ అండర్-19 క్రికెట్‌లో (2017లో సౌరాష్ట్రపై 202* పరుగులు) డబుల్ సెంచరీ చేసిన రెండో భారత మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది.BCCI 'బెస్ట్ డొమెస్టిక్ జూనియర్ ఉమెన్స్ క్రికెటర్' అవార్డును , మహారాష్ట్ర యొక్క అత్యున్నత క్రీడా పురస్కారం అయిన శివ్ ఛత్రపతి అవార్డును కూడా గెలుచుకుంది. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆడుతోంది

జెమీమా రోడ్రిగ్స్ ప్రయాణం అంత సాఫీగా ఏమీ సాగలేదు. గత WC(2022)లో ఆమెను జట్టులోకే తీసుకోలేదు. ఈసారి ఫామ్‌లో ఉండటంతో తొలిసారి వన్డే వరల్డ్ కప్ ఆడే ఛాన్స్ ఇచ్చారు. కానీ తొలి నాలుగు మ్యాచుల్లో జెమీమా రెండు సార్లు డకౌట్ కాగా మరో రెండు సార్లు 30ల్లో ఔట్ అయ్యారు. దీంతో ఇంగ్లాండ్ మ్యాచులో తప్పించారు. అయినా కుంగిపోకుండా తర్వాత న్యూజిలాండ్ పై 76 నాటౌట్, నిన్న సెమీస్‌లో 127 పరుగులు చేసి ఇండియాను ఫైనల్ చేర్చారు. ఇది ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్‌లలో భారత్ సాధించిన అత్యధిక పరుగుల చేదన లో చారిత్రక ఇన్నింగ్స్‌గా నిలిచింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story