జోరూట్ బద్దలు కొట్టిన రికార్డులివే..

Joe Root : ఇండియాతో జరుగుతోన్న నాల్గో టెస్టులో ఇంగ్లాండ్ క్రికెటర్ జో రూట్ 150 పరుగులతో చెలరేగాడు. ఒక్క సెంచరీతో జోరూట్ ఎన్నో రికార్డుటు సృష్టించాడు. రూట్ ఇప్పుడు టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. అతను 13,409కు పైగా పరుగులు చేసి రికీ పాంటింగ్ (13,378), జాక్వెస్ కల్లిస్ (13,289), రాహుల్ ద్రవిడ్ (13,288) వంటి దిగ్గజాలను అధిగమించాడు. సచిన్ టెండూల్కర్ (15,921) మాత్రమే అతని కంటే ముందున్నాడు.

ఈ సెంచరీతో రూట్ తన కెరీర్‌లో 38వ టెస్టు సెంచరీని నమోదు చేశాడు. అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కుమార సంగక్కరతో (38) కలిసి నాలుగో స్థానంలో నిలిచాడు.టెస్టుల్లో భారత్‌పై అత్యధిక సెంచరీలు (12) చేసిన ఆటగాడిగా కూడా రూట్ రికార్డు సృష్టించాడు. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియం వేదికగా టెస్టుల్లో 1000 పరుగులు చేసిన మొదటి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు, కాబట్టి జో రూట్ ఇప్పుడు యాక్టివ్ ఆటగాళ్లలో టెస్టులలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. జో రూట్ ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టుకు టెస్టులు, వన్డేలు రెండింటిలోనూ కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు.

PolitEnt Media

PolitEnt Media

Next Story