Joe Root: ఆ రికార్డ్ సాధించిన ఒకే ఒక్కడు జో రూట్.
ఒకే ఒక్కడు జో రూట్

Joe Root: ఇండియాతో జరుగుతోన్న ఐదో టెస్టులో ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్ మెన్ జో రూట్ మరో సెంచరీ చేసి ప్రపంచ రికార్డ్ సృష్టించాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) చరిత్రలో 6000 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా జో రూట్ అరుదైన ఘనత సాధించాడు. స్మిత్ ,లబుషేన్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. భారత్ పై రూట్ కు టెస్టుల్లో 13 సెంచరీ.
తన 39వ టెస్ట్ సెంచరీని సాధించి అత్యధిక సెంచరీలు సాధించిన జాబితాలో శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర (38 సెంచరీలు)ను అధిగమించి నాలుగో స్థానంలో నిలిచాడు జో రూట్. ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ (51), జాక్వెస్ కలిస్ (45), రికీ పాంటింగ్ (41) మాత్రమే అతని కంటే ముందున్నారు. అతను కేవలం 34 సంవత్సరాల వయసులోనే ఈ రికార్డులను సాధించడం విశేషం. సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించే అవకాశం అతనికి ఉందని చాలా మంది క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
2012లో భారత్‌పై టెస్ట్ అరంగేట్రం చేసిన రూట్, తన మొదటి సెంచరీని 2013లో న్యూజిలాండ్‌పై సాధించారు.2017 నుంచి 2021 వరకు ఇంగ్లాండ్ టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
