Re-entry After Four Years

Jofra Archer: భారత్‌‌తో ఇవాళ్టి నుంచి జరగనున్న మూడో టెస్టుకు ఇంగ్లండ్ ఒక్క మార్పుతో జట్టును ప్రకటించింది. జోష్ టంగ్ ప్లేస్‌లో స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ నాలుగేళ్ల తర్వాత కమ్‌బ్యాక్ ఇస్తున్నారు. దీంతో ఇంగ్లాండ్ బౌలింగ్ అటాక్ స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. లార్డ్స్‌లో గ్రీన్ పిచ్‌ ఉండనుందన్న వార్తల నేపథ్యంలో ఆర్చర్ కీలకంగా మారనున్నారు.

ఆర్చర్ తన చివరి టెస్ట్ మ్యాచ్ ను 2021 ఫిబ్రవరిలో ఆడాడు. ఆ తర్వాత మోచేయికి శస్త్రచికిత్స చేపించుకొని సుదీర్ఘ ఫార్మాట్ కు దూరమయ్యాడు. ఈ క్రమంలో 2023 లో జరిగిన యాషెస్ తో భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ కు దూరమయ్యాడు. జూలై 10నలార్డ్స్ లో భారత్‌తో ఇంగ్లాండ్ మూడో టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ లో ఆర్చర్ బరిలోకి దిగనున్నాడు. ఐదు టెస్టుల సిరీస్ లో ఇరు జట్లు చెరో ఒకటి గెలిచాయి.

ఇంగ్లాండ్ జట్టు: క్రాలే, డకెట్, పోప్, రూట్, బ్రూక్, స్టోక్స్, స్మిత్, వోక్స్, కార్స్, ఆర్చర్, బషీర్

PolitEnt Media

PolitEnt Media

Next Story