ఓపెన్ ఛాలెంజ్..

Jofra Archer: ఇంగ్లాండ్ పర్యటనలో వరుస ఓటములతో సతమతమవుతున్న టీమ్ ఇండియాపై ఇంగ్లీష్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. మూడో టీ20లో ఇంగ్లాండ్ గెలుపులో కీ రోల్ పోషించి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న ఆర్చర్, మ్యాచ్ ముగిసిన తర్వాత మీడియా ముందుకు వచ్చి ఇండియన్ బ్యాటర్లకు గట్టిగా క్లాస్ పీకాడు.ఇంగ్లాండ్ గడ్డపై అంతర్జాతీయ క్రికెట్ ఆడటం.. ఐపీఎల్‌లో ఆడినంత ఈజీ కాదంటూ చురకలు అంటించాడు.ఐపీఎల్ ఆడే ఫ్లాట్ వికెట్లకు, ఇంగ్లాండ్‌లోని పిచ్‌లకు చాలా తేడా ఉంటుందని ఆర్చర్ చెప్పుకొచ్చాడు.
జోఫ్రా ఆర్చర్ మాటల్లోనే చెప్పాలంటే..."భారత్‌లో జరిగే మ్యాచ్‌లలో చిన్న బౌండరీలు, బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌లు ఉంటాయి. అక్కడ 200 రన్స్ చేసినా ఈజీగా చేజ్ అయిపోతాయి. కానీ ఇంగ్లాండ్ పిచ్‌లపై 200 పరుగులు చేయడం అంత ఆషామాషీ కాదు. ఇక్కడి కండిషన్స్, పిచ్‌లు పూర్తి డిఫరెంట్‌గా ఉంటాయి. ఎక్స్ట్రా బౌన్స్‌తో వచ్చే బంతులను ఎదుర్కోవడంలో బ్యాటర్లు నిర్లక్ష్యంగా ఆడితే.. ఇలాంటి ఘోర ఓటములే ఎదురవుతాయి!
అయితే.. కేవలం టీమ్ ఇండియాపై విమర్శలు చేయడంతోనే ఆర్చర్ ఆగలేదు. భారత వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్ విసిరి క్రికెట్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించాడు.
ఈ సిరీస్‌లో ఆర్చర్ బౌలింగ్‌లో వైభవ్ కొన్ని అద్భుతమైన సిక్సర్లు కొట్టిన విషయాన్ని మీడియా గుర్తు చేయగా.. ఆర్చర్ నవ్వుతూ వైభవ్‌కు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. వైభవ్ నా బౌలింగ్‌లో సిక్సర్లు కొట్టిన మాట వాస్తవమేనని ఒప్పుకుంటూనే.. రాబోయే మ్యాచ్‌లో అతడిని ఎలా కట్టడి చేయాలో, ఎలా ఔట్ చేయాలనే దానిపై తాను ఇప్పటికే ఒక పక్కా 'సీక్రెట్ ప్లాన్' రెడీ చేసుకున్నానని వెల్లడించాడు. "రాబోయే మ్యాచ్‌ల్లో వైభవ్‌కు ఇదే నా ఛాలెంజ్.. ఏం జరగబోతుందో చూద్దాం" అంటూ సవాల్ విసిరాడు.మరి ఇంగ్లీష్ స్పీడ్‌స్టర్ విసిరిన ఈ సవాల్‌ను మన ఇండియన్ వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ ఎలా తిప్పికొడతాడో చూడాలి!

