Kane Williamson: క్రికెట్ ప్రపంచంలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. క్రికెట్ గాడ్స్ మెచ్చిన క్లాసిక్ ప్లేయర్, న్యూజిలాండ్ రన్ మెషీన్ కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. అన్ని ఫార్మాట్ల నుంచి తక్షణమే రిటైర్ అవుతున్నట్లు విలియమ్సన్ సంచలన ప్రకటన చేశారు.

బ్లాక్‌క్యాప్స్ (న్యూజిలాండ్) తరపున ఎన్నో అద్భుత విజయాలు అందించిన కేన్ మామ.. తన ప్రశాంతమైన ఆట తీరుతో, జెంటిల్‌మన్ ప్రవర్తనతో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానుల మనసులు గెలుచుకున్నారు. 2021లో న్యూజిలాండ్‌ను ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) విజేతగా నిలబెట్టడంలో ఆయన పాత్ర మరువలేనిది.

కేన్ విలియమ్సన్ భావోద్వేగ ప్రకటన

న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించడం నా జీవితంలో దక్కిన అతిపెద్ద గౌరవం. కానీ, నా కెరీర్‌లో తదుపరి అడుగు వేయడానికి, కుటుంబంతో మరింత సమయం గడపడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నా. నా ప్రయాణంలో అండగా నిలిచిన తోటి ఆటగాళ్లకు, బోర్డుకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ విలియమ్సన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

రెండు దశాబ్దాల పాటు తన క్లాస్ బ్యాటింగ్‌తో అలరించిన ఈ మోడ్రన్ డే గ్రేట్ క్రికెటర్‌కు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఘనంగా వీడ్కోలు పలుకుతున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story