Kapil Dev: క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిలపై నిత్యం విషం చిమ్మే యోగ్రాజ్ సింగ్‌కు... 1983 వరల్డ్ కప్ హీరో కపిల్ దేవ్ తనదైన శైలిలో హితవు పలికారు. యోగ్రాజ్ విమర్శలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన కపిల్ దేవ్... ఎంతో హుందాగా సమాధానమిస్తూనే, గట్టి కౌంటర్ ఇచ్చారు.

గతంలో తండ్రి చేసిన వ్యాఖ్యలకు గానూ యువరాజ్ సింగ్ క్షమాపణలు చెప్పడంపై కపిల్ స్పందించారు. "తండ్రి తప్పుకు యువీ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు. అయినా అదంతా గతం. యువీ దేశానికి అందించిన సేవలను ఎప్పటికీ మరువలేం. ఆట మరింత పాపులర్ కావడంలో యువీ ముఖ్యభూమిక పోషించాడు" అంటూ యువరాజ్ సింగ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

ఇక కేవలం స్నేహితుడిగా మాత్రమే కపిల్‌ను హగ్ చేసుకుంటానన్న యోగ్రాజ్ వ్యాఖ్యలపై కపిల్ దేవ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. "నా వైపు నుంచి అతడు ఇప్పటికీ స్నేహితుడే. కానీ, నెగిటివిటీతో ఉండే ఇలాంటి వ్యక్తులను కలిసేందుకు నేను అస్సలు ఇష్టపడను. ఎప్పుడూ సంతోషంగా ఉండేవారినే కలుస్తాను. నీ (యోగ్రాజ్) కొడుకు క్రికెట్‌లో అద్భుతాలు చేశాడు.. దానితో సంతృప్తి పడాలి. జీవితంలో నీకు మిగతా వారి కంటే ఎక్కువ అవకాశాలే దక్కాయి, అయినా సంతోషపడకపోతే ఎప్పటికీ ఇలాగే మిగిలిపోతావు" అని కపిల్ హితవు పలికారు.

తాను కూడా యోగ్రాజ్ లాగే అసభ్యంగా మాట్లాడితే పరిస్థితి ఏంటని ప్రశ్నించిన కపిల్... లైఫ్‌లో ఎన్నో ఒడుదొడుకులు చూశామని, ఉన్నదానితో సంతోషంగా ఉండడం నేర్చుకోవాలని సూచించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story