Rohit Sharma: ఆర్సీబీతో జరిగిన హైఓల్టేజ్ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తూ.. ఒక్కసారిగా కుప్పకూలిన రోహిత్.. తొడ కండరాల గాయంతో మైదానాన్ని వీడటం ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌ను మాత్రమే కాదు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆందోళనలో పడేసింది.

అయితే రోహిత్ శర్మ గాయానికి సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది. ముంబైలోని రిలయన్స్ ఆస్పత్రిలో రోహిత్‌కు అత్యవసరంగా స్కానింగ్ నిర్వహించారు వైద్యులు. ఈ స్కానింగ్ రిపోర్ట్స్ బట్టి అసలు గాయం తీవ్రత ఎంత? అది కేవలం కండరాల పట్టేయడమేనా లేక ఇంకేదైనా తీవ్రమైన సమస్య ఉందా? అనే విషయంపై ఈ రిపోర్ట్స్ స్పష్టత ఇవ్వనున్నాయి.

కేవలం రిపోర్ట్స్ మాత్రమే కాదు.. రోహిత్ ఫిట్‌నెస్‌పై ముంబై మేనేజ్‌మెంట్ ఒక కీలక ప్రణాళికను సిద్ధం చేసింది. ఇవాళ జరిగే ముంబై ఇండియన్స్ ప్రాక్టీస్ సెషన్‌లో హిట్‌మ్యాన్‌కు ప్రత్యేకంగా ఫిట్‌నెస్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. అంటే బ్యాటింగ్ చేసేటప్పుడు, పరుగెత్తేటప్పుడు రోహిత్ ఎంతవరకు కంఫర్టబుల్‌గా ఉన్నాడో స్వయంగా ఫిజియోలు పరీక్షించబోతున్నారు.

అందరి కళ్లు ఇప్పుడు గురువారం పంజాబ్ కింగ్స్‌తో జరగబోయే తర్వాతి మ్యాచ్‌పైనే ఉన్నాయి. ఇవాళ ఫిట్‌నెస్ టెస్ట్‌లో రోహిత్ పాస్ అయితేనే పంజాబ్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగుతాడు. ఒకవేళ రిపోర్ట్స్‌లో తేడా వస్తే మాత్రం.. హిట్‌మ్యాన్ కొన్ని మ్యాచ్‌లకు దూరం కావాల్సి రావచ్చు. ముంబై జట్టుకు ఇది గట్టి దెబ్బే అని చెప్పాలి. మరి రోహిత్ త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.

PolitEnt Media

PolitEnt Media

Next Story