KL Rahul : కాంతార చాప్టర్ 1పై కేఎల్ రాహుల్ ప్రశంసలు
కేఎల్ రాహుల్ ప్రశంసలు

KL Rahul: కాంతార చాప్టర్ 1 పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. కలెక్షన్లలోనూ బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు సాధిస్తోంది. లేటెస్ట్ గా ఈ సినిమ చూసిన భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ సినిమాపై తన ఇన్ స్టాలో ప్రశంసలు కురిపించారు.
"రిషబ్ శెట్టి మళ్లీ మ్యాజిక్ చేశారు. 'కాంతార చాప్టర్ 1' చూశాను, మరోసారి నా మతి పోయింది (Mind Blown). మంగళూరు ప్రజల నమ్మకాలను అద్భుతంగా చూపించారు."సినిమాలోని రిషబ్ శెట్టి నటన, కథాకథనం ఆ ప్రాంత సంస్కృతిని చూపించిన విధానాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.
కర్ణాటకకు చెందిన కేఎల్ రాహుల్‌కు 'కాంతార' (2022) సినిమా నుంచీ ప్రత్యేక అభిమానం ఉంది.గతంలో ఒక IPL మ్యాచ్ గెలిచిన తర్వాత, ఆయన 'కాంతార' సినిమాలోని దైవ నర్తకుడు నేలపై తన కత్తితో వృత్తం గీసి, ఛాతీపై కొట్టుకునే సెలబ్రేషన్ స్టైల్‌ను అనుకరించారు. "ఈ సెలబ్రేషన్ నా అభిమాన సినిమా 'కాంతార' నుంచి తీసుకున్నాను. ఈ గ్రౌండ్ నా సొంతం అని చెప్పడానికి ఇది ఒక చిన్న రిమైండర్" అని తెలిపారు. దీనిని బట్టి, కేఎల్ రాహుల్ కన్నడ సంస్కృతి, దైవ విశ్వాసాల నేపథ్యంతో వచ్చిన ఈ సినిమాను ఎంతగానో ఇష్టపడుతున్నారని తెలుస్తోంది.
