అదే బెస్ట్ ఇన్నింగ్స్

Former Team India captain Rohit Sharma: 2022 టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్‌పై విరాట్ అద్భుత ఇన్నింగ్స్ ఆడారని రోహిత్ శర్మ గుర్తు చేసుకున్నారు. 160 పరుగుల టార్గెట్ ఛేదనలో 31కే 4 వికెట్లు పడిపోయాయి. నేను డ్రెస్సింగ్ రూమ్‌లో నిరాశగా ఉండిపోయా. అప్పుడు కోహ్లీ అద్భుతం చేశారు. అసలు మేం గెలిచే స్థితిలోనే లేము. అలాంటి ఇంపార్టెంట్ సిచ్యుయేషన్‌లో కోహ్లీ దాన్ని సుసాధ్యం చేశారు. నేను ఆడిన క్రికెట్ మ్యాచుల్లో అదొక గొప్ప ఆట అని ICC ఇంటర్వ్యూలో చెప్పారు.

అది విరాట్ కోహ్లీ కెరీర్‌లోనే అత్యుత్తమ "మాస్టర్ క్లాస్" ఇన్నింగ్స్. రోహిత్ శర్మ అన్నట్లుగా ఆ మ్యాచ్ హైలైట్స్ ,ఆ ఇన్నింగ్స్ ఎందుకు అంత స్పెషల్ అంటే. హారీస్ రౌఫ్, షాహీన్ అఫ్రిదీల వేగానికి భారత టాప్ ఆర్డర్ కకావికలమైంది. 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది.ఒక దశలో భారత్ గెలవాలంటే చివరి 18 బంతుల్లో 48 పరుగులు చేయాలి. అప్పట్లో అది దాదాపు అసాధ్యం అనిపించింది.

19వ ఓవర్ చివరి రెండు బంతులకు కోహ్లీ కొట్టిన ఆ సిక్సర్లు (ముఖ్యంగా స్ట్రెయిట్ డౌన్ ద గ్రౌండ్ కొట్టిన సిక్స్) క్రికెట్ చరిత్రలోనే నిలిచిపోతాయి. ఆ షాట్ చూసి రోహిత్ శర్మతో సహా ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది.

స్టేడియంలో 90 వేల మంది ప్రేక్షకులు, దాయాది దేశంతో మ్యాచ్.. ఆ ఒత్తిడిని తట్టుకుని కోహ్లీ 82 నాటౌట్ (53 బంతుల్లో) స్కోరు చేయడం సామాన్యం కాదు.

మ్యాచ్ గెలిచిన వెంటనే రోహిత్ శర్మ పరిగెత్తుకుంటూ వచ్చి కోహ్లీని భుజాల మీద ఎత్తుకున్న దృశ్యం ప్రతి క్రికెట్ అభిమాని గుండెల్లో నిలిచిపోతుంది. రోహిత్ తన ఇంటర్వ్యూలో చెప్పినట్లుగా, డ్రెస్సింగ్ రూమ్‌లో ఆశలు వదులుకున్న స్థితి నుండి కోహ్లీ ఒక్కడే భారత్‌ను గెలిపించాడు. ఈ ఇన్నింగ్స్‌ను ICC 'టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్'గా అభివర్ణించింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story