గంభీర్‌కు సపోర్ట్‌గా రాబిన్ ఉతప్ప

Robin Uthappa Comes Out in Support of Gambhir: కోల్‌కతా టెస్టులో భారత జట్టు ఘోర పరాజయం నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కోచ్‌గా అతన్ని తొలగించాలనే వాదనలు బలంగా వినిపిస్తున్న తరుణంలో టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప గంభీర్‌కు మద్దతుగా నిలిచారు.

బ్యాటర్లు విఫలమైతే కోచ్ ఏం చేస్తాడు?'

ఉతప్ప తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా గంభీర్‌పై వస్తున్న విమర్శలను ఖండించారు. ఆటగాళ్ల వైఫల్యానికి కోచ్‌ను నిందించడం సరికాదని ప్రశ్నించారు. ‘‘మనం కోల్‌కతా మ్యాచ్‌ ఫలితాన్ని చూసి కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ను తప్పుబడుతున్నాం. కానీ బ్యాటర్లు పరుగులు చేయడంలో విఫలమైతే అతడేం చేస్తాడు? గంభీర్‌ స్వయంగా వచ్చి మ్యాచ్‌ ఆడలేడు కదా"

గతంలో దిగ్గజ ఆటగాడు, కోచ్‌ అయిన రాహుల్ ద్రవిడ్‌ను సైతం ఇలాగే విమర్శించారు’’ అని ఉతప్ప గుర్తు చేశారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎవర్నైనా నిందిస్తారనే విషయం దీని ద్వారా అర్థమైందని ఆయన అన్నారు.

గంభీర్ కోచింగ్‌లో టెస్ట్ గణాంకాలు

గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా ప్రదర్శన టెస్ట్ ఫార్మాట్‌లో ఆశించిన స్థాయిలో లేదు. ఇప్పటివరకు ఆడిన 18 టెస్ట్ మ్యాచ్‌లలో భారత్ కేవలం తొమ్మిదింటిలో మాత్రమే విజయం సాధించింది. ఈ గణాంకాలు గంభీర్‌కు తలనొప్పిగా మారాయి. అయితే, వన్డేలు, టీ20లలో మాత్రం భారత జట్టు ప్రదర్శన మెరుగ్గానే ఉంది.

ముఖ్యంగా కోల్‌కతా టెస్ట్‌లో బ్యాటింగ్ వైఫల్యంతో పాటు గంభీర్ పిచ్‌పై చేసిన వ్యాఖ్యలు మరింత విమర్శలకు తావిచ్చాయి. రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ ఇప్పటికే 0-1తో వెనకబడి ఉంది. సిరీస్‌ను కోల్పోకుండా ఉండాలంటే శనివారం దక్షిణాఫ్రికాతో ప్రారంభం కానున్న రెండో టెస్టులో భారత్ తప్పకుండా విజయం సాధించాల్సి ఉంటుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story